అన్వేషించండి

IND Vs AFG, T20 World Cup 2024: అలరించిన సూర్య! ఆకట్టుకున్న హార్దిక్‌, అఫ్గాన్‌ లక్ష్యం 182

India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్ అర్ధశతకంతో అదరగొట్టాడు.

Ind vs Afg,  India Innings Highlights: టీ 20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌(Surya kumar yadav).. మరో మెరుపు బ్యాటింగ్‌తో టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. సూర్యాకు జత కలిసిన హార్దిక్‌ పాండ్యా (Hardic Pandya) కూడా ధనాధన్‌ బ్యాటింగ్‌ చేయడంతో అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 181 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్‌ బౌలర్లపై ఆరంభం నుంచే  ఎదురుదాడికి దిగిన సూర్యా భాయ్‌... చివరి వరకూ క్రీజులో నిలిచి అఫ్గాన్‌ ముందు భారీ స్కోరు నిలిచేలా చేశాడు. గత మ్యాచ్‌లో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కోహ్లీ కాసేపు క్రీజులో నిలిచి పరుగులు చేశాడు.  పిచ్‌ కాస్త బౌలర్లకు అనుకూలిస్తున్న వేళ టీమిండియా బౌలర్లు ఈ టార్గెట్‌ను కాపాడగలరేమో చూడాలి.

ఆరంభం ఆచితూచి..
కెన్సింగ్‌టన్‌ ఓవల్‌లో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ ఎయిట్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఆరంభంలోనే వికెట్‌ తీసిన అఫ్గాన్‌.. భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. ఆరంభంలో పిచ్‌ చాలా నెమ్మదిగా ఉండడంలో పరుగులు రావడం కష్టమైంది. తొలి 17 బంతుల్లో కేవలం 11 పరుగులే రావడంతో రోహిత్‌ శర్మ రన్‌రేట్‌ పెంచే క్రమంలో అవుటయ్యాడు.  13 బంతుల్లో 8 పరుగులు చేసిన రోహిత్‌... ఫరూకీ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌(Rashid Khan)కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లో విఫలమైన కింగ్ కోహ్లీ... ఈ మ్యాచ్‌లో కాసేపు క్రీజులో నిలిచి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
 
పంత్‌తో కలిసి కోహ్లీ రెండో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా భారీ స్కోరు చేసేలా బాటలు వేశాడు. 24 బంతుల్లో ఒక సిక్స్‌తో 24 పరుగులు చేసిన విరాట్‌ను రషీద్‌ ఖాన్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత 11 బంతుల్లో నాలుగు ఫోర్లతో 20 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌ను కూడా అవుట్‌ చేసిన రషీద్‌ ఖాన్‌ టీమిండియాను దెబ్బ కొట్టాడు. కాసేపటికే ఏడు బంతుల్లో 10 పరుగులు చేసిన దూబేను కూడా రషీద్‌ ఖాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చిన రివ్యూ తీసుకున్న అఫ్గాన్‌... సత్ఫలితాన్ని రాబట్టింది. తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు నేలకూల్చి టీమిండియా భారీ స్కోరు చేయకుండా రషీద్‌ఖాన్‌ అడ్డుకట్ట వేశాడు. అయితే సూర్యాకు జత కలిసిన పాండ్యా టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. 

సూర్య-పాండ్యా ధనాధన్‌
11 ఓవర్లకు 90 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు సూర్య- హార్దిక్‌ మంచి స్కోరు అందించారు. ఉన్నంతసేపు చూడముచ్చని షాట్లతో సూర్య అలరించాడు. రషీద్‌ బౌలింగ్‌లో స్వీప్‌ చేస్తూ కొట్టిన సిక్స్‌ అయితే చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. అఫ్గాన్ సీమర్‌ను ఎటాక్‌ చేస్తూ కొట్టిన స్ట్రైట్‌ సిక్సర్‌ అయితే అద్భుతమనే చెప్పాలి. మొత్తం 28 బంతులు ఆడిన సూర్యా... 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా కూడా ఈ మ్యాచ్‌లో 98 మీటర్ల సిక్స్‌ కొట్టాడు. మొత్తం 24 బంతులు ఆడిన పాండ్యా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా ఏడు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. చివరి ఓవర్‌లో అక్షర్‌ రెండు ఫోర్లు కొట్టడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3, ఫరూకీ 3 వికెట్లు తీసి టీమిండియా మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget