అన్వేషించండి

Asia Cup 2025: 34 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆసియా కప్‌,ఇన్నేళ్లు ఎందుకు నిర్వహించలేదంటే?

Men's Asia Cup 2025 : సుమారు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2025 ఆసియా కప్ భారత్ వేదికగా జరగనుంది. ఆసియా క్రికెట్ మండలి ఈ విషయాన్ని నిర్ధారించింది

 India to host tournament in T20 format:  34 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆసియాకప్‌ టోర్నమెంట్‌(Mens Asia Cup)కు భారత్‌(India) ఆతిథ్యం ఇవ్వనుంది. 1991లో తొలిసారి పురుషుల ఆసియాకప్‌ టోర్నీకి భారత్‌ అతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు 2025లో మరోసారి ఆసియాకప్‌ను భారత్‌ నిర్వహించనుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. 2025లో పురుషుల ఆసియా కప్‌నకు భారత్‌ ఆతిథ్యమిస్తుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) ధృవీకరించింది, 1990,91 ఎడిషన్ తర్వాత ఆసియా కప్‌ను భారత గడ్డపైకి తిరిగి నిర్వహించడం ఇదే మొదటిసారి. 2024-27 సంవత్సరాల్లో  ఆసియా కప్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది.
 
2026లో టీ 20 ప్రపంచ కప్‌ జరగనున్న వేళ దానికి సన్నాహకంగా 2025 ఆసియా కప్‌ను భారత్‌ నిర్వహించాలని నిర్ణయించారు. టీ 20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ను నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగే 2027 ఆసియాకప్‌ను వన్డే తరహాలు నిర్వహిస్తారు. టీ 20 వరల్డ్‌ కప్‌నకు సన్నాహకంగా భారత్‌లో జరిగే ఆసియా కప్‌ను టీ 20 తరహాలో.. వన్డే వరల్డ్‌ కప్‌నకు సన్నాహకంగా బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియాకప్‌ను వన్డే తరహాలో నిర్వహిస్తామని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. 2018, 2022, 2023లు నిర్వహించినట్లే ఈ ఆసియా కప్‌లోనూ ఆరు జట్లు పాల్గొంటాయి. 13 మ్యాచ్‌లను  నిర్వహిస్తారు. 

2027లో బంగ్లా ఆతిథ్యం
2018 ఎడిషన్‌లో ఆసియా కప్‌ హోస్టింగ్ హక్కులను భారత్‌... యూఏఈకి ఇచ్చింది. బంగ్లాదేశ్ కూడా ఆరోసారి ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. బంగ్లాదేశ్‌లో 1998, 2000, 2012, 2014, 2016లో ఆసియా కప్‌ జరిగింది. 2027లోనూ బంగ్లాదేశ్‌లో ఆసియా కప్‌ నిర్వహించనున్నారు. ఆసియా కప్‌తో పాటు, 2025 మహిళల ప్రపంచ కప్, 2026 పురుషుల T20 ప్రపంచ కప్, 2029 పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీతో సహా అనేక ఇతర ప్రధాన టోర్నమెంట్‌లకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. బంగ్లాదేశ్ ఈ ఏడాది చివర్లో 2024 మహిళల T20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2031 పురుషుల వన్డే ప్రపంచ కప్‌కు రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2025, 2027 ఆసియా కప్ టోర్నమెంట్‌లు క్రికెట్ క్యాలెండర్‌లో చాలా ముఖ్యమైనవని... భారత్‌ , బంగ్లాదేశ్‌లు వీటిని సమర్థంగా నిర్వహిస్తాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. 


ఇన్నేళ్లు ఎందుకు నిర్వహించలేదంటే..?
  ఆసియా కప్‌ అంటే ప్రధాన పోరు భారత్‌-పాకిస్థాన్‌(Ind Vs Pak) మధ్యే ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే చూడాలని ప్రతీ అభిమాని కోరుకుంటాడు. అయితే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఒక దేశంలో మరో దేశం పర్యటిచండం లేదు. అందుకే ఆసియా కప్‌ను ఎక్కువ శాతం బంగ్లాదేశ్, శ్రీలంకల్లోనే నిర్వహిస్తూ వస్తున్నారు.  గత ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత్‌ ఈ మ్యాచ్‌లకు వెళ్లకపోవడంతో... శ్రీలంకలో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించారు. అఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫికేషన్‌లో ఆడి వచ్చిన జట్లు ఈ ఆసియా కప్‌లో తలపడతాయి. గత ఏడాది ఆసియా కప్‌ను శ్రీలంకను ఓడించి భారత్ గెలుచుకుంది

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget