Team India: ప్రపంచకప్‌లో భారత్ సరికొత్త రికార్డు - న్యూజిలాండ్‌ను దాటేసి ముందుకు - టాప్ ప్లేస్‌కు ఎంత దూరంలో?
ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది.
ICC Cricket World Cup 2023: ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ను కూడా టీమిండియా ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది ఆరో విజయం. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా, అన్నింటిలోనూ విజయం సాధించింది. భారత్ ఆరో ప్రపంచకప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కూడా భారత్ వరుస విజయాలను ఆపలేకపోయింది. ఈ విజయంతో టీం ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి, ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. ప్రపంచకప్‌లో భారత్ 59 మ్యాచ్‌లు గెలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ను వెనక్కు నెట్టింది. ఈ విషయంలో ఇప్పుడు భారత్ పైన ఒకే ఒక జట్టు ఉంది.
ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టు ఏది?
ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు మొత్తం 73 ప్రపంచకప్ మ్యాచ్‌లు గెలిచింది. ఇది వరల్డ్ రికార్డు. ఇప్పుడు ఈ జాబితాలో రెండో స్థానంలో భారతదేశం నిలిచింది. 59 ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాన్ని రుచి చూసింది. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 58 ప్రపంచకప్ మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉంది.
అంతే కాకుండా ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు కూడా తన పేరిట సరికొత్త రికార్డును సృష్టించింది. నిజానికి ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
ఇంతకు ముందు జరిగిన అన్ని ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్ ఇలా ఎప్పుడూ ఓడిపోలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రయాణం ఈ టోర్నమెంట్‌లో దాదాపు ముగిసింది. వారికి మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇంగ్లండ్ ఇప్పుడు వరుసగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లతో ఆడాల్సి ఉంది.
Heartiest congratulations to Team India on their remarkable sixth consecutive victory in #CWC2023! Skipper @ImRo45's gritty 87-run innings on a challenging batting surface showcased exceptional skill and determination. Kudos to @MdShami11 for his outstanding bowling, claiming 4… pic.twitter.com/PrZFPLlkoM
— Jay Shah (@JayShah) October 29, 2023
Captain Rohit Sharma led from the front with a spectacular 87(101) as he receives the Player of the Match award 🏆#TeamIndia register a 100-run win over England in Lucknow 👏👏
— BCCI (@BCCI) October 29, 2023
Scorecard ▶️ https://t.co/etXYwuCQKP#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/VnielCg1tj
WIN by 💯 runs in Lucknow ✅
— BCCI (@BCCI) October 29, 2023
🔝 of the table with 6⃣ wins in a row!#TeamIndia 🇮🇳#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/oKmCLpCzUt
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial