అన్వేషించండి

IND W vs BAN W 2nd ODI: జెమీమా ఆల్‌రౌండ్ షో - బంగ్లాపై బదులు తీర్చుకున్న భారత్

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు రెండో వన్డేలో ఆతిథ్య జట్టుపై బదులు తీర్చుకుంది. బంగ్లాపై 108 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IND W vs BAN W 2nd ODI: తొలి వన్డేలో తమకు ఎదురైన పరాభవానికి భారత మహిళల జట్టు.. బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకుంది.   టీమిండియా  వెటరన్  బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (78 బంతుల్లో 86, 9 ఫోర్లు)  బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో  (3.1 ఓవర్లలో 3 పరుగులిచ్చి 4 వికెట్లు) కూడా రాణించడంతో  బంగ్లాదేశ్‌పై  ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. 

రాణించిన హర్మన్‌ప్రీత్, జెమీమా 

ఢాకా వేదికగా జరిగిన  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  తొలి వన్డేలో మాదిరిగానే  ఓపెనర్ ప్రియా పునియా (7) మరోసారి విఫలమైంది.  మంగళవారమే బర్త్ డే జరుపుకున్న  స్మృతి మంధాన  (58 బంతుల్లో 36, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది.   వన్ డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా (23 బంతుల్లో 15, 3 ఫోర్లు)  కూడా విఫలమైంది. 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 52, 3 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించారు.  చివర్లో హర్లీన్ డియోల్ (36 బంతుల్లో 25)  త్వరగా పరుగులు  చేయడంలో విఫలమైంది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్.. 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 

కుప్పకూలిన బంగ్లా.. 

మోస్తారు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు ముర్షిదా ఖాన్ (12), షర్మిన్ అక్తర్ (2)లతో పాటు లతా మొండల్ (9) కూడా విఫలమైంది.    అయితే  నాలుగో వికెట్‌కు ఫర్గన హాక్ (81 బంతుల్లో 47, 5 ఫోర్లు), రితూ మోని (46 బంతుల్లో 27, 3 ఫోర్లు) కలిసి  నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.  28 ఓవర్లకు 105-5 గా ఉన్న బంగ్లా.. 15 పరుగుల తేడాతో  ఏడు వికెట్లను కోల్పోయింది. 

 

ఫర్గనను  దేవికా ఔట్ చేసి బంగ్లా పతనాన్ని మొదలుపెట్టింది.  ఆ తర్వాత రోడ్రిగ్స్..  రితూ మోనీని పెవిలియన్‌కు పంపింది. కెప్టెన్ నైగర్  సుల్తానా‌ (1) తో పాటు లోయరార్డర్  బ్యాటర్లు కూడా  దారుణంగా విఫలమయ్యారు.  జెమీమా వరుస ఓవర్లలో నాలుగు వికెట్లు  తీసింది. దేవికా కూడా  8 ఓవర్లు వేసి  30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది.  దీంతో బంగ్లాదేశ్.. 35.1 ఓవర్లలో  120 పరుగులకే చాపచుట్టేసింది. ఈ విజయంతో భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో బంగ్లాదేేశ్ గెలిచిన విషయం తెలిసిందే. సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఈ నెల 22న ఇదే వేదికపై జరుగనుంది. 

 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Embed widget