IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!
భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో జింబాబ్వే 83 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
టీమిండియాతో జరుగుతున్న మొదటి వన్డేలో జింబాబ్వే కష్టాల్లో పడింది. భారత పేసర్లు నిప్పులు చెరగడంతో 20.5 ఓవర్లలో 83 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ రెగిస్ చకాబ్వా (30: 34 బంతుల్లో), లూక్ జాంగ్వే (0: 0 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరు ఓవర్ల వరకు సాఫీగానే సాగింది. ఆ తర్వాత భారత బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన దీపక్ చాహర్ తన మూడు వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు.
ఓపెనర్లు ఇన్నోసెంట్ కయా (4: 20 బంతుల్లో), తదివనాషే మరుమని (8: 22 బంతుల్లో, ఒక ఫోర్), వెస్లీ మదెవెరెలను (5: 12 బంతుల్లో) దీపక్ చాహర్ అవుట్ చేశాడు. మధ్యలో షాన్ విలియమ్స్‌ను (1: 3 బంతుల్లో) సిరాజ్, తర్వాత సికిందర్ రాజా (12: 17 బంతుల్లో, ఒక ఫోర్), ర్యాన్ బుర్ల్‌లను (11: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) ప్రసీద్ కృష్ణ అవుట్ చేశారు. దీంతో జింబాబ్వే 83 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ మూడు, ప్రసీద్ కృష్ణ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు.
టీమిండియా తుదిజట్టు
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
జింబాబ్వే తుదిజట్టు
తదివనాషే మరుమని, ఇన్నోసెంట్ కయా, షాన్ విలియమ్స్, వెస్లీ మదెవెరె, సికిందర్ రాజా, రెగిస్ చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బుర్ల్, లూక్ జాంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యావుచి, రిచర్డ్ నరావా
View this post on Instagram
View this post on Instagram