IND vs WI 3rd ODI: రెండు మ్యాచ్‌లు పోతే పోతాయి - అదేం ఇష్యూ కాదు : హార్ధిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన భారత జట్టుపై విమర్శలు వచ్చినా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాత్రం వాటిని లైట్ తీసుకున్నాడు.
IND vs WI 3rd ODI: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిన భారత్.. మూడో టీ20లో మాత్రం విజయం సొంతం చేసుకుంది. గయానా వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్.. ఏడువికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా సారథి హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ.. రెండు మ్యాచ్‌లు గెలిస్తేనో రెండు మ్యాచ్‌లు ఓడితోనే పెద్దగా పోయేదేం లేదని వ్యాఖ్యానించాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హార్ధిక్ మాట్లాడుతూ..‘ఈ మ్యాచ్‌కు ముందే మేం ఈ మూడు గేమ్స్ చాలా కీలకమని చర్చించుకున్నాం. రెండు మ్యాచ్‌లు గెలిచినా రెండు ఓడిపోయినా దాని ప్రభావం దీర్ఘకాలిక ప్రణాళికలలో మాత్రం ఏ మార్పులూ ఉండవు. కానీ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లలో మాత్రం సత్తా చాటేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.. ’ అని చెప్పాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత టీ20 జట్టులో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్‌లు లేకుండానే బరిలోకి దిగుతోంది. గాయాల కారణంగా కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా, రిషభ్ పంత్‌లు జట్టుకు దూరంగా ఉన్నారు. కొత్త కుర్రాళ్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ తో పాటు ఇటీవలే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ మావి, ముఖేష్ కుమార్ వంటి వారితోనే బరిలోకి దిగుతోంది. ఈ టీమ్‌కు హార్ధిక్ పాండ్యా సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్దమవుతున్న భారత జట్టు.. కొత్తకుర్రాళ్లను వరుసగా అవకాశాలిస్తూ వారిని ఆ దిశగా సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. హార్ధిక్ చెప్పిన దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా ఇవే..
Hardik Pandya said, "two losses or two wins doesn't change the long term plans". pic.twitter.com/YAJ5t2VDjq
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2023
ఇక నిన్నటి మ్యాచ్‌లో విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యూహాలేవీ రూపొందించలేదని పాండ్యా అన్నాడు. పూరన్ బాదుడు పని పెట్టుకుంటే తానే బౌలింగ్ చేయడానికి సిద్ధపడ్డానని చెప్పుకొచ్చాడు. అతడు ఎక్కువసేపు క్రీజులో లేకపోవడంతో చివర్లో పేసర్లతో బంతులు వేయించానని అన్నాడు. ఫ్లోరిడాలో జరుగబోయే నాలుగో టీ20లో తమకు విండీస్ నుంచి తీవ్ర పోటీ ఉంటుందని తెలుసని.. తాము కూడా వారిని ధీటుగా ఎదుర్కునేందుకు రెడీ అవుతున్నామని చెప్పాడు. మూడో టీ20లో సూర్య ఫామ్‌ను అందుకోవడం శుభపరిణామమని, తిలక్ వర్మ కూడా నిలకడగా ఆడుతూ ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్నాడని కొనియాడాడు.
For his breathtaking match-winning knock in the third #WIvIND T20I, Suryakumar Yadav bags the Player of the Match award 🙌 🙌
— BCCI (@BCCI) August 8, 2023
Scorecard ▶️ https://t.co/3rNZuAiOxH #TeamIndia pic.twitter.com/vFQQYFUKOC
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial