అన్వేషించండి

IND vs WI 1st ODI: విండీస్‌పై ఐదు వికెట్లతో భారత్ విజయం - బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు!

భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలిపోయింది. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (43: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (52: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు చేసిన రోహిత్
సాధించాల్సిన లక్ష్యం చిన్నదే కావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ భారీ మార్పులు చేశాడు. శుభ్‌మన్ గిల్‌తో (7: 16 బంతుల్లో, ఒక ఫోర్) పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేశాడు. ఫాంలో ఉన్న శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే గిల్‌ను అవుట్ చేసి జేడెన్ సీల్స్ వెస్టిండీస్‌కు మొదటి వికెట్ అందించాడు. సూర్యకుమార్ యాదవ్‌కు (19: 25 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ప్రమోషన్ ఇచ్చి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపారు. ఇషాన్ కిషన్, సూర్య కలిసి ఒక చిన్న భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు రెండో వికెట్‌కు 36 పరుగులు జోడించారు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్‌ను మోతీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశారు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.

సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా (5: 7 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో భారత్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ కానీ, విరాట్ కానీ అప్పటికి కూడా బ్యాటింగ్‌కు రాలేదు. రవీంద్ర జడేజాను (16 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్) బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపారు. ఇంతలో ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ వెంటనే అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ స్థానంలో వచ్చిన శార్దూల్ (1: 4 బంతుల్లో) ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో రోహిత్ (12 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. 2013 తర్వాత రోహిత్ శర్మ ఆరో స్థానం తర్వాత బ్యాటింగ్‌కు రావడం ఇదే మొదటి సారి. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలిసి మ్యాచ్‌ను ముగించారు. 

తిప్పేసిన స్పిన్నర్లు...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలోనే వెస్టిండీస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా... డేంజరస్ ఓపెనర్ కైల్ మిల్స్‌ను (2: 9 బంతుల్లో) పెవిలియన్ బాట పట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆలిక్ అథనజ్, మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (17: 23 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. వీరు రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో వెస్టిండీస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. 45 పరుగులకే వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయింది.

అయితే కెప్టెన్ షాయ్ హోప్, షిమ్రన్ హెట్‌మేయర్ (11: 19 బంతుల్లో, ఒక ఫోర్) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. ముఖ్యంగా షాయ్ హోప్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కానీ స్పిన్నర్ల చేతికి బంతి వచ్చాక వెస్టిండీస్ కథ మారిపోయింది. షిమ్రన్ హెట్‌మేయర్‌ను అవుట్ చేసి కుల్దీప్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

ఆ తర్వాత ఒక్కసారిగా వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కేవలం 26 పరుగుల తేడాలోనే విండీస్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో వెస్టిండీస్ 114 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, ముకేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.

టాప్ హెడ్ లైన్స్

Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget