IND vs WI 1st ODI: వెస్టిండీస్‌పై భారత్ భారీ స్కోరు - కానీ సరిపోతుందా?
IND vs WI 1st ODI 1st Innings Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు సాధించింది. శిఖర్ ధావన్ (97: 99 బంతుల్లో, 10 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ విజయానికి 50 ఓవర్లలో 309 పరుగులు అవసరం. ఈ లక్ష్యం వెస్టిండీస్‌ను నిలవరించడానికి సరిపోతుందో లేదో చూడాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (64: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), శిఖర్ ధావన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 17.4 ఓవర్లలోనే 119 పరుగులు జోడించారు. అనంతరం లేని పరుగుకు ప్రయత్నించి గిల్ అవుట్ కావడంతో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది.
అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (54: 57 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), ధావన్ మరో భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరు రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. దీంతో భారత్ 213 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ రాణించకపోవడంతో టీమిండియా త్వరగా వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు కూడా వేగంగా చేయలేకపోయింది. దీంతో 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితం అయింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ రెండేసి వికెట్లు తీయగా, రొమారియో షెపర్డ్, అకెల్ హుస్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.
View this post on Instagram
View this post on Instagram