News
News
X

IND vs SL, Asia Cup 2022 Live: భారత్‌ x శ్రీలంక సూపర్‌ 4 మ్యాచ్‌ అప్‌డేట్స్‌!

IND vs SL asia cup 2022: సూపర్- 4 లో తన రెండో మ్యాచ్ లో నేడు భారత్ శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ తలుపులు తెరిచి ఉంటాయి.

FOLLOW US: 
IND vs SL, Asia Cup 2022 Live: ఓ మై గాడ్‌! రోహిత్‌కు షాక్‌! టాస్‌ గెలిచిన లంకేయులు

శ్రీలంకతో జరుగుతున్న సూపర్‌ 4 మ్యాచులో టీమ్‌ఇండియా టాస్‌ ఓడింది. ప్రత్యర్థి జట్టు సారథి దసున్‌ శనక వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఛేదనకు పిచ్‌ అనుకూలిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

IND vs SL, Asia Cup 2022 Live: టాస్ గెలిస్తే సగం గెలిచినట్టే!

ఈ మ్యాచులో టాస్ గెలిచిన జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువ. నేరుగా ఛేదనకే మొగ్గు చూపుతారు. 2021 నుంచి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ఓటమి పాలవుతున్న లంకేయులు ఛేదనలో మాత్రం గెలుస్తున్నారు.

IND vs SL, Asia Cup 2022 Live: టీమ్‌ఇండియా అత్యంత కీలకం

ఆసియా కప్‌ 2022లో టీమ్‌ఇండియా, శ్రీలంక తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌ రోహిత్‌ సేనకు అత్యంత కీలకం. ఇందులో ఓడిపోతే దాదాపుగా ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలిస్తేనే ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

Background

IND vs SL Asia Cup 2022:ఆసియా కప్‌ 2022లో టీమ్‌ఇండియా, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ రోహిత్‌ సేనకు అత్యంత కీలకం. ఇందులో ఓడిపోతే దాదాపుగా ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలిస్తేనే ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

బ్యాటింగ్ ఓకే.. .. కానీ 
 పాక్ తో మ్యాచ్ లో ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్ చేశారు. తొలి 6 ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకుని వేగంగా పరుగులు రాబట్టారు. అయితే రోహిత్, రాహుల్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ఫాం అందుకోవడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఆడిన 3 మ్యాచ్ ల్లోనూ కోహ్లీ మంచి పరుగులు చేశాడు. అయితే ఇంకా వేగంగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. పాక్ తో మ్యాచ్ లో మిడిలార్డర్ వైఫల్యం కూడా కొంపముంచింది. పంత్, పాండ్య, దీపక్ హుడా పెద్దగా పరుగులు చేయలేదు. ఈ మ్యాచ్ లో కీపర్ రిషబ్ పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ ను తీసుకుంటారేమో చూడాలి. 

బౌలింగ్ తీరు మారాలి 
బ్యాటింగ్ లో ఫామ్ చూపిస్తున్న భారత్ ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. గాయాలతో బుమ్రా, హర్షల్ పటేల్ టోర్నీకి ముందే దూరమవటంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. జడేజా మధ్యలో గాయపడి అందుబాటులో లేకుండా పోయాడు. అర్హదీప్ బాగానే బౌలింగ్ చేస్తున్నా, అవేష్ ఖాన్ అంతగా రాణించట్లేదు. ప్రధాన స్పిన్నర్ చహాల్ వికెట్లు తీయలేకపోతున్నాడు. గత మ్యాచ్ లో ఆరో బౌలర్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. హుడా స్పిన్ వేయగలిగినా రోహిత్ అతన్ని ఉపయోగించుకోలేదు. జడేజా స్థానంలో ఎంపికైన అక్షర్ పటేల్ ను ఈరోజు ఆడిస్తారేమో చూడాలి. అతను టీంలోకి వస్తే రవి బిష్ణోయ్ పెవిలియన్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అలాగే విఫలమవుతున్న చహాల్ స్థానంలో అశ్విన్ ను తీసుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బౌలింగ్ విభాగం రాణించకపోతే గెలవడం కష్టమే.

 

లంక చేతిలో భారత్ ఓడితే పైనల్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. చివరి మ్యాచ్ లో అఫ్గాన్ పై నెగ్గినా చాలా సమీకరణాలు కలిసిరావాలి. కాబట్టి అంతవరకు రాకుండా ఉండాలంటే బలహీనతల్ని అధిగమించి, సమష్టిగా ఆడి శ్రీలంకపై గెలవాలి. 

పిచ్ పరిస్థితి 
దుబాయ్ పిచ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. మొదట టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కు మొగ్గుచూపొచ్చు.

గత రికార్డు 
ఇప్పటివరకూ శ్రీలంక- భారత్ 25 టీ20ల్లో తలపడ్డాయి. అందులో 17 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. ఏడింట్లో లంక విజయం సాధించగా.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. 

భారత్ తుది జట్టు (అంచనా) 
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్ దినేశ్ కార్తీక్, పాండ్య, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ రవి బిష్ణోయ్, అర్హదీప్ సింగ్, చహాల్  అశ్విన్.

శ్రీలంక తుది జట్టు (అంచనా) 
నిశాంక్, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), హసరంగ, చామిక కరుణరత్నే, తీక్షణ, దిల్షాన్, మదుశంక.