IND vs SL: కొత్త వ్యూహంతో వచ్చాం - వన్డేల్లో భారీ స్కోరు ఖాయం: శ్రీలంక కెప్టెన్ షనక
గౌహతిలో జరగనున్న మొదటి మ్యాచ్ హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుందని శ్రీలంక కెప్టెన్ షనక అభిప్రాయపడ్డారు.
India vs Sri Lanka ODI Series: భారత్‌తో ఇటీవల ముగిసిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లోని సానుకూల అంశాలపై దృష్టి సారిస్తున్నానని మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో కఠినమైన సవాలును ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక సోమవారం అన్నారు.
మొదటి టీ20 ఇంటర్నేషనల్‌లో శ్రీలంక విజయానికి చేరువైంది, కానీ కేవలం రెండు పరుగుల తేడాతో మాత్రమే ఓడిపోయింది. ఇక రెండో టీ20లో ఆ జట్టు చెలరేగి 16 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అయితే రాజ్‌కోట్‌లో జరిగిన మూడో మరియు చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
తొలి వన్డేకు ముందు దసున్ షనక మాట్లాడుతూ ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికా తప్ప మరే ఇతర జట్టు భారత్‌లో విజయం సాధించలేకపోయిందన్నాడు. ముంబైలో తాము గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, కానీ ఇంకా బలంగా ఆడారన్నారు. భారత్‌పై విజయం సాధించాలంటే కచ్చితంగా పోటీ క్రికెట్ ఆడాల్సిందే అన్నారు.
మంచి ప్రదర్శన చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన షనక, "భారతదేశంలో ప్రపంచ కప్ జరగనున్నందున ఇది శ్రీలంకకు ముఖ్యమైన టోర్నమెంట్. కాబట్టి సిరీస్ కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పాడు. అతను ఇంకా మాట్లాడుతూ, ఇది చాలా మంచి టోర్నీ అవుతుందని అభిప్రాయపడతాడు. ఎందుకంటే రెండు జట్లకూ పరిస్థితులు సమానంగా ఉంటాయని, దీనికి తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. ఈ టోర్నీ ప్రాముఖ్యత వారికి తెలుసన్నాడు.
శ్రీలంక కెప్టెన్ టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో 187.87 స్ట్రైక్ రేట్‌తో తన జట్టు తరఫున అత్యధికంగా 124 పరుగులు చేశాడు. ఇక్కడికి వచ్చే ముందు తాను బాగా రాణించాలనే ఉద్దేశంతో ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. భారత్‌పై బాగా ఆడటం చాలా ముఖ్యం అని చెప్పాడు. గౌహతిలో జరగనున్న తొలి వన్డేకు హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుందని శ్రీలంక కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. వికెట్‌ను చూశామని, ఇది పెద్ద స్కోరింగ్ మ్యాచ్‌గా కనిపిస్తోందని అన్నాడు.
View this post on Instagram