IND vs SL 2nd T20: రాహుల్ త్రిపాఠి అరంగేట్రం - హర్షల్ ప్లేస్‌లో అర్షదీప్
IND vs SL 2nd T20: శ్రీలంకతో రెండో టీ20లో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు.
IND vs SL 2nd T20:
శ్రీలంకతో రెండో టీ20లో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. పుణెలో రెండో ఇన్నింగ్సులో మంచు కురిసే అవకాశం ఉందన్నాడు. వికెట్ బాగుందన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లకు ఇక్కడ మంచి రికార్డుందని తనకు తెలియదని పేర్కొన్నాడు. తాము బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్న విధానానికి సంతోషంగా ఉందన్నాడు. వాంఖడేలో 160ని డిఫెండ్ చేయడం గొప్పేనని వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేస్తున్నాడని, హర్షల్ పటేల్ స్థానంలో అర్షదీప్ వచ్చాడని వివరించాడు.
తుది జట్లు
భారత్: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక: పాథుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ శనక, వనిందు హసరంగ, చామిక కరుణ రత్నె, మహీశ్ థీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుశనక
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram