అన్వేషించండి
Advertisement
IND vs SL 2024: నవ శకానికి ఆరంభం, నేడే లంకతో భారత్ పోరు
IND vs SL 2024 : శ్రీలంకతో నేటి నుంచి టీమిండియా పోరుకు సిద్ధమైంది. టీ 20 వరల్డ్ కప్ విజయంతో ఊపు మీద ఉన్న భారత్ టీం కొత్త కోచ్ గైడెన్స్‌లో నూతన శకం ప్రారంభించనుంది.
India Vs Sri Lanka: కొత్త కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు పల్లెకలెలో తొలి మ్యాచ్ జరగునుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. హార్దిక్ పాండ్యాను కాదని టీ 20 విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య పగ్గాలు అప్పజెప్పడంపై వివాదం చెలరేగిన వేళ ఈ మ్యాచ్‌తో వాటికి చెక్ పెట్టాలని సూర్య భాయ్ భావిస్తున్నాడు. మరోవైపు సొంత మైదానంలో టీ 20 ప్రపంచ ఛాంపియన్ టీమిండియాకు షాక్ ఇచ్చి శుభారంభం చేయాలని శ్రీలంక కూడా పట్టుదలతో ఉంది.
కీలక ఆటగాళ్లు లేకుండానే..
టీ 20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు వీడ్కోలు పలకడంతో ప్రస్తుతం భారత్ సంధి దశలో ఉంది. ఈ సిరీస్‌తోనే భారత్ భవిష్యత్తు ప్రణాళికలు ముడిపడి ఉన్నాయి. దీంతో నేడు పల్లెకెలెలో భారత్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ భారత్ టీ 20లో నవ శకానికి నాంది పలకనుంది. శ్రీలంక కెప్టెన్‌గా చరిత్ అసలంక నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు జట్లను ఎలా నడిపిస్తారో చూడాలి. భారత్, శ్రీలంక రెండు జట్లకు కొత్త ప్రధాన కోచ్‌లు ఉన్నారు. భారత్‌కు గౌతమ్ గంభీర్, శ్రీలంకకు సనత్ జయసూర్య కోచ్‌లుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరి మార్గ నిర్దేశనంలో ఇరు జట్లు ఎలా రాణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇది రెండు జట్లకు కొత్త ఆరంభం అయినప్పటికీ భారత్‌తే పైచేయిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల టీ 20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత్ మంచి టచ్‌లో ఉంది. జింబాబ్వేతో జరిగిన అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా లంక ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటారు. జాఫ్నా కింగ్స్‌కు సారథ్యం వహించన శ్రీలంక కెప్టెన్ అసలంక... ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు.
బలంగా భారత బ్యాటింగ్
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. తర్వాత రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ రానున్నారు. దీంతో భారత్‌కు లోయర్ ఆర్డర్ వరకూ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే సొంత మైదానంలో లంక బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే భారత్‌కు తిప్పలు తప్పకపోవచ్చు. అలాగే అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఖలీల్ మహ్మద్, సిరాజ్‌లతో కూడిన బౌలింగ్ లైనప్ కూడా పర్వాలేదనిపిస్తోంది.
Also Read: అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం
బుమ్రాకు విశ్రాంతి
ఈ సిరీస్‌కో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించింది. మరోవైపు సిరీస్ ప్రారంభానికి ముందే శ్రీలంకకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. దుష్మంత చమీర, నువాన్ తుషార, బినురా ఫెర్నాండో గాయాల కారణంగా వైదిలిగారు. మతీషా పతిరన ఫామ్‌లో ఉండడం లంకకు కలిసిరానుంది.
శ్రీలంక జట్టు:
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో/కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, మశన్‌క ఫెర్నాండో , మతీష పతిరణ
భారత జట్టు:
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్/ఖలీల్ మహ్మద్, సిరాజ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement