IND vs SA, T20 WC 2022: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ టైమింగ్‌లో మార్పు - ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో?
IND vs SA, T20 WC 2022 Live Streaming: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికాను ఆదివారం ఢీకొట్టనుంది. మరి ఈ మ్యాచ్ వేదిక, లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, జట్ల వివరాలు మీ కోసం!
IND vs SA, T20 WC 2022 Live Streaming: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో టీమ్‌ఇండియా మూడో సూపర్ 12 మ్యాచుకు రెడీ! గ్రూపులో అత్యంత బలమైన దక్షిణాఫ్రికాను ఆదివారం ఢీకొట్టనుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం! మరి ఈ మ్యాచ్ వేదిక, లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, జట్ల వివరాలు మీ కోసం!
When Does India vs South Africa Super 12match Begin (Date and Time in India) in ICC T20 World cup 2022?
భారత్, దక్షిణాఫ్రికా టీ20 వేదిక పెర్త్ ఆప్టస్ క్రికెట్ స్టేడియం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 4:00 గంటలకు టాస్ వేస్తారు.
Where to Watch India vs South Africa Super 12match?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా గెలుచుకుంది. భారత్ x దక్షిణాఫ్రికా సహా మిగతా మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. స్టార్‌సోర్ట్స్ 1, స్టార్‌స్పోర్ట్స్ 1హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానళ్లలో వీక్షించొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, మళయాలం భాషాల్లో చూడొచ్చు.
How to Watch India vs South Africa Super 12match Live Streaming Online for Free in India?
టీ20 ప్రపంచకప్ మ్యాచులను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
ICC T20 World Cup 2022 Schedule
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 మొదలైంది. నవంబర్ 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్ 23న పాకిస్థాన్, 27న నెదర్లాండ్స్‌తో ఆడింది. 30న దక్షిణాఫ్రికా, నవంబర్ 2న బంగ్లాదేశ్, 6న జింబాబ్వేతో తలపడుతుంది.
India vs South Africa T20 ProbableXI
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
దక్షిణాఫ్రికా: తెంబా బవుమా, క్వింటన్ డికాక్, రిలీ రొసో, అయిడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, త్రిస్టన్ స్టబ్స్, వేన్ పర్నెల్, కేశవ్ మహరాజ్, కాగిసో రబాడా, ఆన్రిచ్ నోకియా, తబ్రైజ్ శంషి
View this post on Instagram