Quinton de Kock Centuries Record: మూడో వన్డేలో క్వింటన్ డికాక్ రికార్డుల మోత.. ఫాస్టెస్ట్, హయ్యస్ట్ సెంచరీలతో దిగ్గజం సరసన
Quinton de Kock Century against India: విశాఖపట్నంలో జరుగుతున్న భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్డేలో వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సెంచరీ సాధించాడు.

India vs South Africa 3rd ODI | భారత్‌తో జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్ లో క్వింటన్ డి కాక్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్ డికాక్ నిలిచాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో సఫారీ ఓపెనర్ శతకం బాదేశాడు. ఇది డి కాక్ వన్డే కెరీర్‌లో 23వ సెంచరీ, ఈ వన్డే మ్యాచ్‌లో 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. భారత్‌పై ODIలలో అత్యంత వేగంగా 7 సెంచరీలు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు
వన్డే క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో క్వింటన్ డి కాక్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరతో సమానంగా నిలిచాడు. వన్డే ఫార్మాట్లో ఇద్దరూ 23 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు షై హోప్ 3వ స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్‌గా హోప్ 19 సెంచరీలు చేశాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ 16, జోస్ బట్లర్ 11, MS ధోని వికెట్ కీపర్‌గా 10 ODI సెంచరీలు సాధించారు.
Castled! 🎯
— BCCI (@BCCI) December 6, 2025
It's Prasidh Krishna once again who gets the breakthrough for #TeamIndia 🙌
Quinton de Kock departs for 106
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/cOYYg1YsyO
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు
- 23 శతకాలు - క్వింటన్ డి కాక్
- 23 శతకాలు - కుమార్ సంగక్కర
- 19 శతకాలు - షాయ్ హోప్
- 16 శతకాలు - ఆడమ్ గిల్‌క్రిస్ట్
- 11 శతకాలు - జోస్ బట్లర్
భారతదేశంపై అత్యధిక సెంచరీలు.. ఫాస్టెస్ట్ సైతం
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ గా క్వింటన్ డి కాక్ నిలిచాడు. మరోవైపు వన్డే క్రికెట్ చరిత్రలో భారతదేశంపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు. డికాక్ కేవలం 23 ఇన్నింగ్స్‌లలో భారతదేశంపై 7 ODI సెంచరీలు సాధించాడు. శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య ఇన్ని సెంచరీలే (7) చేశాడు, కానీ అతను ఆ మైలురాయిని చేరుకోవడానికి 85 ఇన్నింగ్స్‌లు పట్టింది. ఈ జాబితాలో డి కాక్ భారతదేశంపై అత్యంత వేగంగా 7 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, రికీ పాంటింగ్ టాప్ 5 లో ఉన్నారు.
- క్వింటన్ డి కాక్ - 7 సెంచరీలు (23 ఇన్నింగ్స్‌లు)
- సనత్ జయసూర్య - 7 సెంచరీలు (85 ఇన్నింగ్స్‌లు)
- ఏబీ డివిలియర్స్ - 6 సెంచరీలు (32 ఇన్నింగ్స్‌లు)
- రికీ పాంటింగ్ - 6 సెంచరీలు (59 ఇన్నింగ్స్‌లు)
భారత్‌లో 1000 వన్డే పరుగులు
భారతదేశంలో ఆడుతూ డికాక్ 1000 వన్డే పరుగులు కూడా పూర్తి చేశాడు. డి కాక్ ఇప్పుడు భారతదేశంలో ఆడుతూ 1085 పరుగులు చేశాడు. అతను భారత్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా అగ్ర స్థానంలో నిలిచాడు.





















