అన్వేషించండి

IND Vs SA, Match Highlights: సఫారీ గడ్డపై కొత్త చరిత్ర,రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం

IND Vs SA, Match Highlights: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌  తేడాతో పరాజయం పాలైన భారత్‌ జట్టు.. రెండో టెస్టులో ఘన విజయం సాధించింది.

దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌  తేడాతో పరాజయం పాలైన భారత్‌ జట్టు.. రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో భారత పేసర్లు.. సఫారీ బ్యాటర్లలకు చుక్కలు చూపించి...విజయానికి బాటలు వేశారు. 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌... సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 
 
తొలి ఇన్నింగ్స్‌ సాగిందిలా...
కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. చెలరేగిన సిరాజ్ ధాటికి దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. సిరాజ్‌ ఆరు వికెట్లతో ప్రొటీస్‌ పనిపట్టాడు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి ప్రొటీస్‌ 55 పరుగులకే కుప్పకూలడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది.
భారత్‌కు 98 పరుగుల ఆధిక్యం
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా 153 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది. టీమిండియా చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్‌ వద్ద కోల్పోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. . టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. 
మార్‌క్రమ్‌ ఒంటరి పోరాటం
ఓవర్‌నైట్‌ స్కోరు 62 పరుగులకు మూడు వికెట్ల నష్టంతో రెండో రోజూ ఆట కొనసాగించిన ప్రొటీస్‌... బుమ్రా ధాటికి 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. రెండోరోజూ ఆటలో అసలు సిసలు ఆటంటే ఐడెన్‌ మార్‌క్రమ్‌దే. వరుసగా వికెట్లు పడుతున్నా మార్‌క్రమ్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు బుమ్రా వరుసగా వికెట్లు తీస్తున్నా...మరోవైపు ఎదురుదాడికి దిగి ప్రొటీస్‌కు ఆ మాత్రం స్కోరైనా అందించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసిన మాక్రమ్‌... 103 బంతుల్లో 17 ఫోర్లు రెండు సిక్సులతో 106 పరుగులు చేశాడు. ప్రొటీస్‌ చేసిన 153 పరుగుల్లో 106 పరుగులు మార్‌క్రమే చేశాడు. 99 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న మార్క్‌రమ్‌.. సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యం అందించాడు.  రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా . ఆరు వికెట్లు నేలకూల్చి దక్షిణాఫ్రికా పతనాన్నిశాసించాడు.  అనంతరం 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget