Ind vs sa 1st odi scorecard: విరాట్ క్లాస్ సెంచరీ.. రాణించిన రోహిత్, రాహుల్ హాఫ్.. దక్షిణాఫ్రికాకు బిగ్ టార్గెట్
భారత్ 349 పరుగులు చేసింది. రాంచీలో జరిగిన వన్డేలో కోహ్లీ 52వ శతకం సాధించాడు.

ind vs sa 1st odi | రాంచీలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ సాధించాడు. రన్ మేషిన్ మరో సెంచరీతో టన్ మేషిగా మారి 135 పరుగులు చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (57 పరుగులు), కెప్టెన్ కెఎల్ రాహుల్ (60) అర్ధ సెంచరీలు సాధించారు. గిల్ గాయంతో సిరీస్ కు దూరం కాగా, రాహుల్ ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ప్రారంభం నుంచే దూకుడుగా షాట్లు ఆడటానికి ప్రయత్నించారు, ముఖ్యంగా జైస్వాల్ వేగంగా ఆడే క్రమంలో కేవలం 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కలిసి రెండో వికెట్ కు సెంచరీ ( 136 పరుగులు) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Innings Break!
— BCCI (@BCCI) November 30, 2025
Virat Kohli's sublime century and 5⃣0⃣s from Rohit Sharma and captain KL Rahul propel #TeamIndia to 3️⃣4️⃣9️⃣/8 🙌
Over to our bowlers!
Scorecard ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/kPTmx2ek1k
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తరువాత ఔటయ్యడు. ఆ తరువాత పది ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. అయితే మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయి వీర విహారం చేశాడు. తనకు అచ్చొచ్చిన రాంచీలో 102 బంతుల్లో సెంచరీ మార్కు చేరుకున్నాడు. శతకం తరువాత కోహ్లీ జోరు పెంచాడు. ఓ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో నాలుగు బంతుల్లోనే 20 పరుగులు రాబట్టాడు కింగ్ కోహ్లీ.

గైక్వాడ్ ఫెయిల్..
ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 8 పరుగులు చేసి అవుటయ్యాడు. డెవాల్డ్ బ్రెవిస్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ తో గైక్వాడ్ పెవిలియన్ చేరాడు. జడేజా, రాహుల్ కంటే ముందు వాషింగ్టన్ సుందర్‌ను 5వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. సుందర్ 13 పరుగులు చేసి ఈజీ క్యాచ్ కు ఔటయ్యాడు. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలతో పాటు రిషబ్ పంత్ సైతం జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఏ స్థానంలోనైనా సత్తా చాటుతున్న రాహుల్
కెఎల్ రాహుల్ ఇప్పటికే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. కీలక సమయంలో బ్యాటింగుకు దిగిన రాహుల్ 60 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట కోహ్లీతో కలిసి వేగంగా పరుగులు చేసిన రాహుల్, చివర్లో జడేజాతో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధమని నిరూపించాడు. ఆల్ రండర్ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులు చేయతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 చేసి సఫారీలకు బిగ్ టార్గెట్ ఇచ్చింది.
సచిన్ రికార్డు బ్రేక్
ఈ వన్డేలో విరాట్ కోహ్లీ 52వ సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాల రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. అయితే దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే శతకాలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. తాజాగా సఫారీలపై ఆరో వన్డే శతకాన్ని కింగ్ కోహ్లీ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. మరోవైపు రాంచీ రారాజు తానేనని కోహ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. రాంచీలో ఆడిన 5వ ఇన్నింగ్సులో ఏకంగా 3వ శతకం చేయగా, వందకు పైగా సగటుతో ఉన్నాడు.





















