IND Vs SA, 1st ODI: 40 ఓవర్ల వన్డే - టాస్ గెలిచిన గబ్బర్, రుతురాజ్ అరంగేట్రం
IND Vs SA, 1st ODI: భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే టాస్ వేశారు. టీమ్‌ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం రావడం, మైదానం చిత్తడిగా ఉండటంతో టాస్ గంటకు పైగా ఆలస్యమైంది.
IND Vs SA, 1st ODI: భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే టాస్ వేశారు. టీమ్‌ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం రావడం, మైదానం చిత్తడిగా ఉండటంతో టాస్ గంటకు పైగా ఆలస్యమైంది. దాంతో మ్యాచును చెరోవైపు 40 ఓవర్లకు కుదించారు. ఒక్కో బౌలర్ గరిష్ఠంగా 8 ఓవర్లు వేయొచ్చు. పవర్‌ప్లే 1 ఎనిమిది ఓవర్లు, రెండో పవర్‌ప్లే 24 ఓవర్లు, మూడో పవర్ ప్లే 8 ఓవర్లు ఉంటాయి. ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నామని గబ్బర్ తెలిపాడు. రుతురాజ్ అరంగేట్రం చేస్తున్నాడని వెల్లడించాడు.
🚨 Team News 🚨@Ruutu1331 to make his ODI debut. 👍
— BCCI (@BCCI) October 6, 2022
Follow the match ▶️ https://t.co/d65WZUUDh2
Here is #TeamIndia's Playing XI for the first #INDvSA ODI 🔽 pic.twitter.com/otnX6dauyt
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్
దక్షిణాఫ్రికా: జానెమన్ మలన్, క్వింటన్ డికాక్, తెంబా బవుమా, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పర్నెల్, కేశవ్ మహారాజ్, కాగిసో రబాడా, లుంగి ఎంగిడి, తబ్రైజ్ శంషి
సంజూపై చూపు
🚨 Toss Update 🚨#TeamIndia have elected to bowl against South Africa in the first #INDvSA ODI.
— BCCI (@BCCI) October 6, 2022
Follow the match ▶️ https://t.co/d65WZUUDh2 pic.twitter.com/Fp26EPIXQq
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం హిట్‌మ్యాన్ సేన ఇప్పటికే ఆసీస్ బయల్దేరింది. దాంతో శిఖర్ ధావన్ టీమ్‌ఇండియాను నడిపించనున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అతడు సెంచరీ చేయలేదు. ఈ సారి కరవు తీర్చుకుంటాడేమో చూడాలి. జింబాబ్వే, వెస్టిండీస్‌పై రాణించిన శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌లో ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్ మధ్య ఒక ప్లేస్ కోసం పోటీ నెలకొంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ గురించి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో దీపక్ చాహర్ పై అందరి చూపూ నెలకొంది. ఒకవేళ అతడు రాణిస్తే ప్రపంచకప్ ఆడొచ్చు. కుల్‌దీప్, రవి బిష్ణోయ్ స్పిన్, సిరాజ్, శార్దూల్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు.
ప్రపంచకప్ కోసం
టీ20 ఫార్మాట్లో రాణిస్తున్నప్పటికీ వన్డేల్లో దక్షిణాఫ్రికా వెనకబడే ఉంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ ఆడాలంటే ఈ సిరీసులో గెలవడం అత్యంత ముఖ్యం. అందుకే ప్రధాన ఆటగాళ్లనే ఆడించనుంది. తెంబా బవుమా ఫామ్ లేమి ఆ జట్టును వేధిస్తోంది. మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మిడిలార్డర్‌లో కీలకం అవుతారు. క్వింటన్ డికాక్, జానెమన్ మలన్ ఓపెనింగ్ చూసుకుంటారు. ప్రపంచకప్ రిజర్వుగా ఎంపికైన అండిలె ఫెలుక్‌వాయో, మార్కో జన్‌సెన్ బౌలింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఆల్‌రౌండర్ ప్లేస్ కోసం వీరు పోటీ పడుతున్నారు.