అన్వేషించండి
Advertisement
T20 World Cup 2024: ఫుల్ ఎమోషన్‌తో భారత్ పాకిస్థాన్ మ్యాచ్- బాబర్‌ను రోహిత్ నవ్విస్తే- నసీమ్ షా మాత్రం కంటతడి పెట్టాడు
Ind vs Pak Match Highlights: మ్యాచ్‌లో భారత్‌ను 119 పరుగులకే పరిమితం అవ్వటానికి కారణం పాక్ పేసర్ నసీమ్. తన పదునైన పేస్‌తో మూడు వికెట్లు తీసీనా ఫలితం లేకుండా పోవటంతో నసీమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Naseem Shah in Tears : టీ 20 ప్రపంచకప్(T20 World Cup )లో భారత్(Team India) జైత్రయాత్రకు పాకిస్థాన్(Pakistan) బలైపోయింది. టీమిండియా బౌలర్ల ముందు పాక్ బ్యాటర్ల ఆటలు సాగలేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను 119 పరుగులకే పరిమితం చేశామన్న సంతోషం... పాక్‌కు మిగలకుండా పోయింది. లక్ష్య ఛేదనలో పాక్ 113 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తక్కువ పరుగులకే అవుట్ కావడానికి ప్రధాన కారణం పాకిస్థాన్ పేసర్ నసీమ్. తన పదునైన పేస్‌తో నసీమ్ మూడు వికెట్లు తీశాడు. అయితే భారత్ చేతిలో ఓటమి అనంతరం నసీమ్ (Naseem Shah) కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి కేవలం 4 బంతుల్లో పది పరుగులు చేసిన నసీమ్ పాక్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ పేసర్ ఏడ్చేశాడు.
చివరి ఓవర్లో
అర్ష్‌దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్లో నసీమ్ షా రెండు సింగిల్స్, రెండు ఫోర్లు బాదాడు. అయినా ఆఖరి బంతికి పాకిస్థాన్ 8 పరుగులు చేయాల్సి ఉండగా ఒక్క పరుగే వచ్చింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత విజయం పాక్ ఆటగాళ్లకు తీవ్ర నిర్వేదాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్‌ను 20 వికెట్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మూడు వికెట్లు తీసిన పాకిస్థాన్ పేసర్ నసీమ్ షా బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించాడు.
నవ్వులు పూయించిన రోహిత్
మన హిట్ మ్యాన్ రోహిత్ సంగతి తెలిసిందేగా... గజినీకి కజిన్ బ్రదరులా తయారువుతున్నాడు. అన్నీ మర్చిపోతున్నాడు. అలాగే నిన్న ఇండియా పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో కూడా హడావిడి చేశాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే టాస్ వేయాల్సిన కాయిన్‌ను గ్రౌండ్‌లోకి వచ్చేప్పుడు అంపైరింగ్ స్టాఫ్ రెండు టీమ్స్‌లో ఏదో ఒక కెప్టెన్‌కి అందిస్తారు. అలా నిన్న రోహిత్ శర్మకు టాస్ కాయిన్ ఇచ్చారు. దాన్ని ప్యాంట్ జేబులో వేసుకున్న రోహిత్ శర్మ ఆ సంగతి మర్చిపోయాడు. కామెంటేటర్ రవిశాస్త్రి ఇచ్చిన ఎలివేషన్లకు మొత్తం బ్లాంక్ అయిపోయింది ఏమో. టాస్ వేయండి అన్నప్పుడు కాయిన్ ఎక్కడుంది భాయ్ అని బాబర్ ఆజమ్‌ని అడిగాడు రోహిత్ శర్మ. తర్వాత మళ్లీ తనే ప్యాంటు జేబు వెతుక్కుని సారీ అంటూ నవ్వుతూ కాయిన్ తీసి టాస్ వేశాడు.
View this post on Instagram
రోహిత్ చేష్టలకు బాబర్ ఆజమ్ కూడా హ్యాపీగా నవ్వుకున్నాడు. టాస్ రోహిత్ శర్మ ఓడిపోవటంతో పాకిస్థాన్ బౌలింగ్ తీసుకోవటం టీమిండియా 119 పరుగులకే పరిమితమై పాకిస్థాన్‌కు 120 పరుగుల టార్గెట్ ఇవ్వటం జరిగిపోయాయి. బూమ్ బూమ్ బుమ్రా దయ వల్ల పాకిస్థాన్ టార్గెట్ చేరుకోకుండా కట్టడి చేసిన భారత్ మ్యాచ్ గెలవగా..రోహిత్ శర్మ ఈ టాస్ కాయిన్ మర్చిపోయిన విజువల్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు గతంలోనూ చాలా సార్లు రోహిత్ శర్మ గ్రౌండ్ లోకి వచ్చాక ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అని అడిగితే పేర్లు మర్చిపోయి ఫన్ క్రియేట్ చేస్తాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion