టీ 20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో భారత్‌ పాకిస్థాన్ మధ్య మరో నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్



న్యూయార్క్‌లో అత్యంత వివాదాస్పద పిచ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాక్ విజయాన్ని లాక్కున్న బుమ్రా



తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 119 పరుగులకే ఆలౌట్ అయింది.



120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 12.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 73 పరుగులు చేసింది.



12.1 ఓవర్‌ నుంచి అసలైన డ్రామా మొదలైంది. అక్కడే బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.



చివరకు పాకిస్థాన్ కేవలం 20 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేసింది.



బాబర్‌, రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ వికెట్లు తీసుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పిన బుమ్రాను బు మ్యాచ్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ వరించింది.



ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కూడా రెండు కీలకమైన వికెట్లు తీసుకున్నాడు.



బ్యాటింగ్‌లో అందరూ ఫెయిల్ అయినా వైవిధ్యమైన షాట్స్‌తో రిషబ్ పంత్‌ 42 పరుగులు చేసి జట్టుకు గౌరప్రదమైన స్కోర్ అందించాడు.



పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌ మూడేసి వికెట్లు, మహ్మద్‌ ఆమిర్‌ రెండు వికెట్లు పడగొట్టారు.



Thanks for Reading. UP NEXT

రోహిత్ శర్మ కొత్త చరిత్ర- కోహ్లీ అలర్ట్‌ అవ్వాల్సందేనా

View next story