బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ తరఫున టాప్ క్లాస్ క్రికెటర్లు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇందులో బాబర్ బ్యాట్ పట్టుకుని రిజ్వాన్ వెనక పరుగెడుతున్నాడు. అసలు దీని వెనక ఏం జరిగింది? రిజ్వాన్... బాబర్‌ని రెచ్చగొట్టడం వల్లే ఇది జరిగిందని తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఇద్దరి మధ్యా సరదాగా జరిగిన సంఘటన మాత్రమే. ఇందులో సీరియస్‌గా తీసుకోవడానికి ఏమీ లేదు. వీరిద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌కు సన్నద్ధం అవుతున్నారు. ఈ సిరీస్‌లో రెండు జట్లూ మూడు టెస్టులు ఆడనున్నాయి. పాకిస్తాన్ టీమ్ క్యాంప్ ప్రస్తుతం రావల్పిండిలో జరుగుతోంది.