వన్డే ప్రపంచకప్ తరువాత టీమిండియా యువ జట్టు ఆస్ట్రేలియాతో టీ 20 సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు టీమిండియాను BCCI సోమవారం రాత్రి ప్రకటించింది. 5 టీ20ల సిరీస్ కు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు భారత్- ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా ఆసీస్, భారత్ తొలి టీ20లో తలపడనున్నాయి జితేష్ శర్మ లాంటి హార్డ్ హిట్టర్ కు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. బౌలర్లు అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు రవి బిష్ణోయ్ కి ఛాన్స్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. యువ ఆటగాళ్లు ఆసీస్ ను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.