India vs Pakistan Asia Cup: ఆదివారమే భారత్ x పాక్! టైమింగ్, ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎందులో?
IND vs PAK Live Streaming: ఫ్యాన్స్ ఆదివారం కోసం ఎదురు చూస్తున్నారు. హై వోల్టేజీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండటమే ఇందుకు కారణం. మరి ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీ కోసం!
IND vs PAK Live Streaming: ఆసియాకప్ 2022 శనివారం మొదలవుతోంటే అభిమానులేమో ఆదివారం కోసం ఎదురు చూస్తున్నారు. హై వోల్టేజీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఆటగాళ్లంతా కఠోర సాధన చేస్తున్నారు. విజయంతో టోర్నీ ఆరంభించాలని పట్టుదలగా ఉన్నారు. మరి ఈ మ్యాచ్ వేదిక, లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, జట్ల వివరాలు మీ కోసం!
When Does India vs Pakistan T20 match Begin (Date and Time in India) in Asia cup 2022?
భారత్, పాకిస్థాన్ టీ20 వేదిక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 7:00 గంటలకు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs Pakistan T20 match?
ఆసియాకప్ 2022 ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా గెలుచుకుంది. భారత్ x పాక్ సహా మిగతా మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. స్టార్‌సోర్ట్స్ 1, స్టార్‌స్పోర్ట్స్ 1హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానళ్లలో వీక్షించొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, మళయాలం భాషాల్లో చూడొచ్చు.
How to Watch India vs Pakistan T20 match Live Streaming Online for Free in India?
ఆసియాకప్ మ్యాచులను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
Asia cup 2022, India Schedule
ఆగస్టు 27న ఆసియాకప్ మొదలవుతుంది. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఆగస్టు 28, ఆదివారం రోజు పాక్, ఆగస్టు 31, బుధవారం రోజు హాంకాంగ్‌తో తలపడుతుంది. సెప్టెంబర్ ౩ నుంచి సూపర్-4 మ్యాచులు జరుగుతాయి.
India vs Pakistan T20 ProbableXI
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్
పాకిస్థాన్: బాబర్ ఆజామ్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హ్యారిస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, కుష్‌దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీమ్, నసీమ్ షా, షహనాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్
Up close and personal with @imVkohli!
— BCCI (@BCCI) August 27, 2022
Coming back from a break, Virat Kohli speaks about the introspection, the realisation and his way forward! 👍
Full interview coming up on https://t.co/Z3MPyeKtDz 🎥
Watch this space for more ⌛️ #TeamIndia | #AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/fzZS2XH1r1