అన్వేషించండి

IND vs PAK LIVE Score: ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ - పాకిస్తాన్‌పై 228 పరుగులతో భారత్ విజయం

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
IND vs PAK LIVE Score: ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ - పాకిస్తాన్‌పై 228 పరుగులతో భారత్ విజయం

Background

2023 ఆసియా కప్‌లో నేడు (ఆదివారం) భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తన తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఈ సారి ఏకంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం స్పిన్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించలేదు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రాఫ్‌కు అవకాశం లభించింది.

భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రాఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్‌కు అవకాశం ఇవ్వడంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నమ్మకం వ్యక్తం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో కూడా ఫహీమ్ అష్రాఫ్ బాగా బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌పై అద్భుతంగా బౌలింగ్ కూడా చేశాడు.

నలుగురు ఫాస్ట్ బౌలర్లతో దిగనున్న పాకిస్తాన్
భారత్‌పై నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో షహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లతో పాటు ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్ యాక్షన్‌లో కనిపిస్తారు. షాదాబ్ ఖాన్ లీడ్ స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. అతనికి మద్దతుగా సల్మాన్ అఘా, ఇఫ్తికర్ అహ్మద్ కూడా తుది జట్టులో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌పై బాబర్ ఆజం విశ్వాసం ఉంచాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ చాలా ఘోరంగా ఓడించింది.

22:58 PM (IST)  •  11 Sep 2023

ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ - పాకిస్తాన్‌పై 228 పరుగులతో భారత్ విజయం

32 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కానీ నసీం షా, హరీస్ రౌఫ్ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో భారత్ 228 పరుగులతో భారీ విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

22:53 PM (IST)  •  11 Sep 2023

31 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 121-7

31 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో షహీన్ షా అఫ్రిది, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.

ఫహీం అష్రాఫ్ (4: 9 బంతుల్లో)
షహీన్ షా అఫ్రిది (0: 3 బంతుల్లో)

శార్దూల్ ఠాకూర్ : 4-0-16-1

22:49 PM (IST)  •  11 Sep 2023

ఏడో వికెట్ కోల్పోయిన పాక్... 30 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 119-7

ఇఫ్తికర్ అహ్మద్‌ను అవుట్ చేసి కుల్దీప్ భారత్‌కు ఏడో వికెట్ అందించాడు. 30 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో షహీన్ షా అఫ్రిది, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.

ఫహీం అష్రాఫ్ (2: 3 బంతుల్లో)
షహీన్ షా అఫ్రిది (0: 3 బంతుల్లో)

ఇఫ్తికర్ అహ్మద్ (సి అండ్ బి) కుల్దీప్ యాదవ్ (23: 35 బంతుల్లో, ఒక ఫోర్)

కుల్దీప్ యాదవ్ : 7-0-18-4

22:44 PM (IST)  •  11 Sep 2023

29 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 115-6

29 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.

ఇఫ్తికర్ అహ్మద్ (19: 32 బంతుల్లో)
ఫహీం అష్రాఫ్ (2: 3 బంతుల్లో)

రవీంద్ర జడేజా : 5-0-26-0

22:41 PM (IST)  •  11 Sep 2023

ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్... 28 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 111-6

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి షాదాబ్ ఖాన్ అవుటయ్యాడు. 28 ఓవర్లు అయ్యే సరికి పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో ఇఫ్తికర్ అహ్మద్, ఫహీం అష్రాఫ్ ఉన్నారు.

ఇఫ్తికర్ అహ్మద్ (16: 28 బంతుల్లో)
ఫహీం అష్రాఫ్ (1: 1 బంతి)

షాదాబ్ ఖాన్ (సి) శార్దూల్ ఠాకూర్ (బి) కుల్దీప్ యాదవ్ (6: 10 బంతుల్లో)

కుల్దీప్ యాదవ్ : 6-0-14-3

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget