IND vs PAK LIVE Score: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - వర్షం కారణంగా భారత్, పాక్ మ్యాచ్ రద్దు
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2023 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE
Background
IND vs PAK Playing 11: ఆసియా కప్ 2023లో శనివారం భారత్ తొలి మ్యాచ్ ఆడుతోంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో పోటీ పడుతోంది. ఆసియా కప్ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ తరువాత భారత్, పాక్ తలపడడం ఇదే మొదటిసారి. చాలా కాలం తరువాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పూర్తి బలంతో కనిపిస్తోంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు భారత జట్టు బెంగళూరులలో శిక్షణ పూర్తి చేసుకుంది.
అలాగే ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ సైతం జోరు మీద ఉంది. బాబర్ ఆజం నేతృత్వంలోని జట్టు నేపాల్‌ను 238 పరుగుల తేడాతో ఓడించింది. తాను కప్ రేసులో ఉన్నట్లు బలమైన సంకేతం పంపింది. తాజాగా భారత స్కిప్పర్ రోహిత్ సైతం పాకిస్తాన్‌తో పోరు అంత సులభం కాదని చెప్పాడు. పాక్‌తో పోరుకు అన్నివిధాలా సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా చేరికతో భారత జట్టుకు బలం చేకూరింది. KL రాహుల్ ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీంతో పాకిస్తాన్ మొదట బౌలింగ్ చేయనుంది. శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు.
భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ తుదిజట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
దేశంలో క్రికెట్ జట్టు అభిమానులకు బ్యాడ్ న్యూస్. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు జట్లకూ చెరో పాయింట్ లభించనుంది.
మ్యాచ్‌పై మళ్లీ వర్షం దెబ్బ - ఈసారి చాలా గట్టిగా!
ఇన్నింగ్స్ బ్రేక్‌లో మళ్లీ వర్షం పడటం ప్రారంభం అయింది. అయితే ఈసారి వర్షం అంత త్వరగా తగ్గేలా కనిపించడం లేదు. గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో పూర్తిగా కప్పి ఉంచారు.
266 పరుగులకు టీమిండియా ఆలౌట్ - పాకిస్తాన్ ముందు యావరేజ్ టార్గెట్!
48.5 ఓవర్లలో 266 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. 49వ ఓవర్లో నసీం షా రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
48 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 261-8
48 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా 12(12)
కుల్దీప్ యాదవ్ 4(11)
షహీన్ షా అఫ్రిది : 10-2-35-4
47 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 257-8
47 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా 11(9)
కుల్దీప్ యాదవ్ 2(8)
హరీస్ రౌఫ్ : 9-0-58-3