By: ABP Desam | Updated at : 30 Nov 2022 05:01 AM (IST)
Edited By: nagavarapu
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (source: twitter)
IND vs NZ 3rd ODI: నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా నిర్ణయాత్మకమైన మూడో వన్డే జరగనుంది. ఇందులో గెలిస్తే టీమిండియా సిరీస్ ను సమం చేస్తుంది. ఒకవేళ కివీస్ గెలిస్తే సిరీస్ ఆ జట్టు సొంతమవుతుంది. అయితే మధ్యలో వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. ఈ వేదికలోనూ వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం పడి మ్యాచ్ రద్దయినా న్యూజిలాండ్ దే సిరీస్. ఎందుకంటే తొలి వన్డే గెలిచిన కివీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.
బ్యాటింగ్ ఓకే
బ్యాటింగ్ లో భారత్ బాగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్ కు సహకరించిన పిచ్ పై కూడా మన ఓపెనర్లు ధావన్, గిల్ లు శతక భాగస్వామ్యం అందించారు. మిడిలార్డర్ లోనూ శ్రేయస్, సంజూ శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. రెండో వన్డేలో ధనాధన్ బ్యాటింగ్ చేసిన సూర్య కూడా ఫాంలోకి వచ్చినట్లే. అయితే పంత్ ఫామే ఆందోళన కలిగిస్తోంది. టీ20 వైఫల్యాన్ని వన్డేల్లోనూ కొనసాగిస్తున్నాడీ వికెట్ కీపర్. సంజూ శాంసన్ తొలి మ్యాచులో పరవాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆల్ రౌండర్ దీపక్ హుడా కోసం రెండో వన్డేలో సంజూను పక్కన పెట్టారు. ఏదేమైనా బ్యాటింగ్ లో భారత్ ఓకే అనిపిస్తోంది.
బౌలింగే ఆందోళనకరం
టీమిండియా ఆందోళనంతా బౌలింగ్ తోనే. తొలి వన్డేలో 300 పైచిలుకు లక్ష్యాన్ని కూడా కాపాడలేకపోయారు మన బౌలర్లు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే పరవాలేదనిపించే ప్రదర్శన చేశారు. శార్దూల్ ఠాకూర్ మొదట బాగానే బౌలింగ్ చేసినా.. ఆఖర్లో ధారాళంగా పరుగులిచ్చేశాడు. రెండో మ్యాచుకు శార్దూల్ స్థానంలో దీపక్ చాహర్ ను తీసుకున్నారు. అతడెంత మేర ఆకట్టుకుంటాడో చూడాలి. అర్షదీప్ అనుకున్నంతమేర రాణించడంలేదు. ఇక స్పిన్నర్ చాహల్ ఇంకా ఫాంలోకి రాలేదు. జోరుమీదున్న కివీస్ ను ఆపాలంటే బౌలింగ్ లో అద్భుతమనిపించే ప్రదర్శన చేయాల్సిందే
Preps 🔛 #TeamIndia gear up for the 3⃣rd #NZvIND ODI in Christchurch 👌 👌 pic.twitter.com/2nkFpFNi77
— BCCI (@BCCI) November 29, 2022
జోరు మీద కివీస్
తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన కివీస్ జోరు మీద ఉంది. కెప్టెన్ విలియమ్సన్, టామ్ లాథమ్ భీకరమైన ఫాంలో ఉన్నారు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ లాంటి బ్యాటర్లు వారి సొంతం. సౌథీ, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ లాంటి వారితో బౌలింగ్ లోనూ బలంగానే కనిపిస్తోంది. న్యూజిలాండ్ దూకుడును ఆపాలంటే భారత్ పోరాట పటిమను ప్రదర్శించాల్సిందే.
Back at Hagley! Training prep ahead of the sold out 3rd final ODI against India in the Sterling Reserve Series. #NZvIND pic.twitter.com/RqdGAT0IPS
— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2022
పిచ్ పరిస్థితి
క్సైస్ట్ చర్చ్ వేదికలో వర్షం పడే సూచనలు ఉన్నాయి. చెదురుమదురు జల్లులతో ఆట మధ్యలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్
— BCCI (@BCCI) November 29, 2022
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్కు ఆడబోమన్న ఆస్ట్రేలియా - సురేష్ రైనా ఏమన్నాడంటే?
Virat Kohli: కళ్లకు గంతలు కట్టుకున్నా టార్గెట్ మిస్ అవ్వదు - విరాట్ వైరల్ వీడియో చూస్తే ఎవరైనా ఫ్యాన్స్ అవ్వాల్సిందే!
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్లో కీలక ఆటగాళ్లు - ఐసీసీ ఎవరిని సెలక్ట్ చేసింది?
WPL 2023: ప్లేఆఫ్స్కు మూడే జట్లు - మహిళల ఐపీఎల్లో వెరైటీ రూల్!
IND vs AUS Test: ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాదే- ఎందుకంటే: గ్రెగ్ ఛాపెల్
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!