IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!
IND vs NZ 3rd ODI: భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటయ్యింది.
IND vs NZ 3rd ODI: భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బౌలర్లు సమష్టిగా రాణించటంతో ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. 48 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటయ్యింది.
టాపార్డర్ విలవిలా
తొలి వన్డేలో శుభారంభం అందించిన భారత ఓపెనర్లు ఈ మ్యాచులో నిరాశపరిచారు. శుబ్‌మన్ గిల్ కేవలం 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 28 పరుగులు చేసి క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన కెప్టెన్ శిఖర్ దావన్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా 55 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా త్వరగానే వికెట్ పారేసుకున్నాడు. ఫామ్ లేక తంటాలు పడుతున్న రిషబ్ కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చి సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సౌథీ బౌలింగ్‌లో మిల్నేకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మరోవైపు క్రీజులో నిలదొక్కుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ (49) అర్ధశతకానికి అడుగు దూరంలో ఫెర్గూసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. తర్వాత దీపక్ హుడా (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రాగానే 2 సిక్సులు కొట్టిన దీపక్ చాహర్ ఓ షార్ట్ పిచ్ బంతికి ఔటయ్యాడు.
సుందర్, చాహల్ ల భాగస్వామ్యం
ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ అడపాదడపా బౌండరీలు కొడుతూ, సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. అతనికి చాహల్ (8) చక్కని సహకారం అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలో చాహల్, అర్హదీప్ ఔటయ్యారు. 48వ ఓవర్లో సౌథీ బౌలింగ్ లో సిక్స్ తో అర్ధశతకం పూర్తిచేసుకున్న వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత రెండో బంతికే ఔటయ్యాడు. దీంతో 219 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది.
న్యూజిలాండ్ బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ మూడేసి వికెట్లు తీసుకోగా.. సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. శాంట్నర్, ఫెర్గూసన్ లకు ఒక్కో వికెట్ దక్కింది.
.@Sundarwashi5 scored a fighting half-century & was our top performer from the first innings of the third #NZvIND ODI. 👏 👏 #TeamIndia
— BCCI (@BCCI) November 30, 2022
A summary of his knock 🔽 pic.twitter.com/4JcYJkRmdG
Two now for @dazmitchell47! India 7 down at Hagley Oval. Follow play LIVE in NZ with @sparknzsport and in India with @PrimeVideoIN. #NZvIND pic.twitter.com/FZHsATpVRp
— BLACKCAPS (@BLACKCAPS) November 30, 2022