By: ABP Desam | Updated at : 20 Jan 2023 01:25 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs న్యూజిలాండ్ ( Image Source : BCCI )
India vs New Zealand Live Streaming:
న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. అభిమానులకు మరో థ్రిల్లర్ అందించేందుకు రెడీ అంటోంది. రాయ్‌పుర్ వేదికగా కివీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ టైమింగ్స్, వేదిక ఇతర వివరాలు మీకోసం.
శ్రీలంకను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు స్వదేశంలో వన్డేల్లో నంబర్ వన్ జట్టు అయిన న్యూజిలాండ్‌తో తలపడుతోంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే ఎప్పుడు జరుగుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే జనవరి 21వ తేదీన శనివారం జరగనుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే ఏ సమయానికి ప్రారంభమవుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇండియా vs న్యూజిలాండ్ రెండో వన్డే ఎక్కడ జరుగుతుంది?
రాయ్‌పుర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే జరగనుంది.
ఇండియా vs న్యూజిలాండ్ రెండో వన్డే ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
ఇండియా vs న్యూజిలాండ్ రెండో వన్డే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ స్ట్రీమింగ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిషెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి
Tagenarine Chanderpaul: డబుల్ సెంచరీతో చెలరేగిన తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ - తండ్రితో కలిసి అరుదైన క్లబ్‌లోకి!
IND vs AUS: రోహిత్ శర్మతో అతనే ఓపెనింగ్ చేయాలి - హర్భజన్ ఎవరి పేరు చెప్పారో తెలుసా?
Sanjay Bangar on Kohli: 'ఆస్ట్రేలియాతో ఆడడం కోహ్లీకి ఇష్టం- బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అదరగొడతాడు'
IND vs AUS: రోహిత్, కోహ్లీపై ప్రెషర్ - ఆ ముగ్గురిపై నజర్
IND vs AUS: WTC తో లింక్ - ఆసీస్ హ్యాపీ.. ఇండియాకు బీపీ..!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!