అన్వేషించండి

India vs Nepal: టీమ్ఇండియా.. ఇదేం ఫీల్డింగ్‌! 3 క్యాచులు డ్రాప్‌ - 28 ఓవర్లకు నేపాల్‌ 123/4

India vs Nepal: ఆసియా కప్‌-2023లో నేపాల్‌ ఆకట్టుకుంటోంది. చక్కని పోరాట పటిమను కనబరుస్తోంది. పల్లెకెలె వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో మ్యాచులో తమదైన బ్యాటింగ్‌తో అదరగొడుతోంది.

India vs Nepal: 

ఆసియా కప్‌-2023లో నేపాల్‌ ఆకట్టుకుంటోంది. చక్కని పోరాట పటిమను కనబరుస్తోంది. పల్లెకెలె వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో మ్యాచులో తమదైన బ్యాటింగ్‌తో అదరగొడుతోంది. 28 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌ (50*; 88 బంతుల్లో 7x4) తిరుగులేని హాఫ్ సెంచరీ సాధించాడు. గుల్షన్ ఝా (12; 23 బంతుల్లో 1x4) అతడికి తోడుగా ఉన్నాడు. మరో ఓపెనర్‌ కుశాల్‌ భూర్తెల్‌ (38; 25 బంతుల్లో 3x4, 2x6) ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. శార్దూల్‌ ఠాకూర్‌కు ఒక వికెట్‌ దక్కింది. హిట్‌మ్యాన్‌ సేన తన స్థాయికి తగిన బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేయడం లేదు.

ఆరంభం.. ప్లాఫ్!

ఆకాశం నిండా మబ్బులు.. చల్లని వాతావరణం.. టాస్‌ గెలిచిన ఫీల్డింగ్‌! ఇన్ని అనకూలతల మధ్య టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఎలా ఉండాలి? చురకత్తుల్లాంటి బంతుల్ని స్వింగ్‌ చేస్తుంటే ప్రత్యర్థి వణికిపోవాలి! కానీ అలా జరగలేదు. నేపాల్‌ వంటి చిన్న జట్టు పైనా ఆరంభంలో వికెట్లు తీయడంలో హిట్‌మ్యాన్‌ సేన విఫలమైంది. వరుసగా మూడు క్యాచుల్ని.. అదీ నాలుగు ఓవర్లలోపే నేల పాలు చేసింది. దాంతో నేపాలీలకు ఊహించని.. అద్భుతమైన ఆరంభం లభించింది.

ఆసిఫ్‌.. హాఫ్‌ సెంచరీ!

తమకు దొరికిన జీవనదానాలను నేపాల్‌ చక్కగా వినియోగించుకుంది. ఓపెనర్లు కుశాల్‌ భూర్తెల్‌, ఆసిఫ్‌ షేక్‌ విజృంభించడంతో 53 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి చేరుకుంది. వీరిద్దరూ టీమ్‌ఇండియా బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. పోరాడితే పోయేదీమీ లేదన్న చందంగా దూకుడగా ఆడారు. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో పదో ఓవర్‌ వరకు భారత్‌ వికెట్‌ కోసం ఎదురు చూసింది. మొత్తానికి 9.5వ బంతికి కుశాల్‌ను శార్దూల్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా విజృంభించాడు. వరుసగా భీమ్‌ షాక్రి (7), రోహిత్‌ పౌడెల్‌ (5), కుశాల్‌ (2)ను ఔట్‌ చేశాడు.

డ్రాప్‌ క్యాచులు

ఇన్నింగ్స్‌ ఆరో బంతికే టీమ్‌ఇండియాకు అవకాశం దొరికింది. షమి వేసిన బంతిని భూర్తెల్‌ ఆఫ్‌సైడ్‌ ఆడబోయాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి స్లిప్‌లోకి వెళ్లింది. దానిని అందుకోవడంలో శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఒక సిట్టర్‌ను విరాట్‌ కోహ్లీ మిస్‌ చేశాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 1.1వ బంతిని షేక్‌ ఆడాడు. ఆఫ్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్‌ మీదుగా వచ్చిన బంతిని స్ట్రెయిట్‌గా ఆడబోయాడు. గాల్లోకి లేచిన బంతి షార్ట్‌పిచ్‌ వద్ద కోహ్లీ వద్దకు వెళ్లింది. అతడి చేతుల్లోంచి జారిపోయింది. మహ్మద్‌ షమి వేసిన 4.2వ బంతికీ భూర్తెల్‌కు మరో లైఫ్‌ లభించింది. తన వద్దకే వచ్చిన బంతిని కీపర్‌ ఇషాన్‌ కిషన్ లెఫ్ట్‌వైప్‌ దూకి మిస్‌ చేశాడు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షహి, మహ్మద్‌ సిరాజ్

నేపాల్‌ జట్టు: కుశాల్‌ భూర్తెల్‌, ఆసిఫ్ షేక్‌, రోహిత్‌ పౌడెల్‌, భీమ్‌ షక్రి, సోంపాల్‌ కామి, గుల్షన్‌ ఝా, దీపేంద్ర సింగ్‌, కుశాల్‌ మల్లా, సందీప్‌ లామిచాన్‌, కరన్‌ కేసీ, లలిత్‌ రాజ్‌భాన్షి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget