India Won Test Series with Young Cricketers | ఇంగ్లాండ్ కి దడ పుట్టించిన భారత కుర్రాళ్లు
ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ అంటేనే చూసే వాళ్లకి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఆడే వాళ్లు కూడా చాలా అగ్రెసివ్ గా మారిపోతారు. అయితే ఈ సారి జరిగిన టెస్ట్ సిరీస్ మాత్రం కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. సీనియర్స్ లేకుండా ఒక కొత్త కెప్టెన్ తో... యంగ్ ఇండియా టీం ఇంగ్లాండ్ సిరీస్ ఆడడానికి బయలుదేరింది. కుర్రోళ్లే కదా ఎం చేస్తారులే అని అనుకుంటే సీన్ రివర్స్ చేసి చూపించారు.
కెప్టెన్ గా భాద్యతలు తీసుకున్న 25 ఏళ్ల శుబ్మన్ గిల్ తన కెప్టెన్సీతో పాటు బ్యాట్ తో కూడా గట్టి సమాదానం ఇచ్చాడు. రికార్డుల మోత మోగిస్తూ... బజ్ బాల్ టీంకె చుక్కలు చూపించాడు. ఈ టెస్ట్ సిరీస్ లో 754 పరులు చేసాడు. ఈ సిరీస్ లో అందర్నీ అక్కటుకున్న మరో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. గత కొంత కాలంగా ఓపెనర్ గా జైస్వాల్ మంచి క్రికెట్ ని ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో ఓపెనర్ గా 2 సెంచరీలు చేసాడు. అలాగే మరోసారి గాయంతో టీం కు దూరమైన రిషబ్ పంత్ కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. కే ఎల్ రాహుల్ తన పార్టనర్ జైస్వాల్ తో కలిసి కీలక సమయాల్లో టీంకు రన్స్ అందించాడు.
ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే సిరాజ్ మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. యంగ్ పేసర్ ఆకాశ్ దీప్ తన డెబ్యూ మ్యాచ్‌లోనే కీలకమైన వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ది ఓవల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ప్రసిద్ కృష్ణ 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 4 వికెట్లు తీసాడు. ఇలా అందరు కలిసి ఈ టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన కనబర్చి... ఇండియా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించారు.





















