Siraj About Lords Test Match | నా మిస్టేక్ నాలో కసిని పెంచిందంటున్న సిరాజ్
ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో సిరాజ్ హీరోగా నిలిచాడు. ది ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో తన అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ టీంకు సిరాజ్ చుక్కలు చూపించాడు. నిజం చెప్పాలంటే సిరాజ్ పెర్ఫార్మన్స్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అందుకు కారణం సిరాజ్ చేసిన తప్పులు.
లార్డ్స్ టెస్టు మ్యాచ్ లో ఆఖరి వికెట్ మిగిలి ఉండగా.. జడేజా టీంను గెలిపించడానికి సింగల్ హ్యాండెడ్ గా క్రీజ్ లో నిలబడ్డాడు. మరోవైపు జడేజాకు తోడుగా సిరాజ్ నిలబడ్డాడు. గెలవడానికి కేవలం 22 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. ఆ సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లను తన స్టైల్ ఎదుర్కొంటు నిలబడ్డాడు సిరాజ్. కానీ ఒక స్పిన్ బాల్ ని ఎదుర్కుంటున్న టైం లో సిరాజ్ డిఫెండ్ చేసినప్పటికీ కూడా బాల్ దొర్లుకుంటూ వెళ్లి వికెట్స్ కు తాకింది. ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. కళ్ళలో నీళ్లతో అక్కడ నుంచి సిరాజ్ వెళ్ళిపొయ్యాడు.
ఇక ఓవల్ టెస్టులో లో ఇండియా గెలుపు కోసం పోరాడుతుంది. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటర్లు చాలా స్పీడ్ గా రన్స్ చేస్తున్నారు. సరిగ్గా అదే టైం లో చేతిలోకి వచ్చిన బ్రూక్ క్యాచ్‌ని సిరాజ్ పట్టుకునాడు. కానీ రోప్‌ని తొక్కేశాడు. లార్డ్స్ లో ఓటమి, బ్రూక్ క్యాచ్ ని మిస్ చేయడంతో సిరాజ్ కసిగా బౌలింగ్ చేసి భారత్‌ను గెలిపించాడు. గెలవలేము అనుకున్న మ్యాచ్ ని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్‌కు గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చాడు. మ్యాచ్‌ని గెలిపించిన తర్వాత సిరాజ్ గ్రౌండ్‌లో ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేశాడు. దినేష్ కార్తీక్ తో మాట్లాడుతూ బ్రూక్ క్యాచ్ విషయంపై సిరాజ్ బాధపడ్డాడు. నిజంగా చెప్తున్నాను, బ్రూక్ క్యాచ్ పట్టుకుని రోప్‌ని తాకుతానని అస్సలు అనుకోలేదు. అది మ్యాచ్ ఛేంజింగ్ మూమెంట్. కచ్చితంగా ఈ రోజు నా దేశానికి నేను గేమ్ ఛేంజర్‌ను అవుతా అనుకున్నాను. ఈ రోజు 140 కోట్ల మంది ఆనందంగా ఉన్నారు.. ఆ ఫీల్ మామూలుగా లేదు' అని సిరాజ్ అన్నాడు.





















