News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

India vs England: శనివారం వన్డే ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.

FOLLOW US: 
Share:

India vs England: 2023 వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023) సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. క్రికెట్ కురుక్షేత్రం అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. వార్మప్ మ్యాచ్‌లు నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం అయ్యాయి. రేపు (శనివారం, సెప్టెంబర్ 30వ తేదీ) భారత్, ఇంగ్లండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (IND vs ENG) జరగనుంది.

ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగడం ద్వారా ప్రపంచ కప్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ని పరీక్షించడానికి ఇరు జట్లకు ఇది గొప్ప అవకాశం.

వార్మప్ మ్యాచ్‌లో మొత్తం 15 మంది ఆటగాళ్లను ఉపయోగించుకోవచ్చు. 11 మంది ఆటగాళ్లు మాత్రమే బ్యాటింగ్ చేసినప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా బ్యాటింగ్ చేయవచ్చు. ఎవరైనా, ఎక్కడైనా బౌలింగ్ చేయవచ్చు.

పొంచి ఉన్న వర్షం ముప్పు (IND vs ENG Weather Forecast)
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీన గౌహతిలో బలమైన వర్షం కురిసే అవకాశం ఉంది. గౌహతిలో శనివారం 50 శాతం నుంచి 55 శాతం వరకు వర్షం కురిసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? (IND vs ENG Venue)
గౌహతిలోని బర్సపరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:00 గంటలకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌ని లైవ్ ఎక్కడ చూడాలి? (IND vs ENG Live Streaming)
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ వార్మప్ మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్ హిందీలో అభిమానులు ఈ మ్యాచ్‌ని వీక్షించవచ్చు. ఆన్‌లైన్‌లో మ్యాచ్‌ను చూస్తున్న వీక్షకులు హాట్ స్టార్‌లో చూడవచ్చు. మొబైల్, ట్యాబ్లెట్లలో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. టీవీల్లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే!

2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు (Team India Squad)
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ. , రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్

2023 వన్డే ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ జట్టు (England Squad)
జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 29 Sep 2023 11:48 PM (IST) Tags: England IND vs ENG ICC World Cup 2023 INDIA India Vs England

ఇవి కూడా చూడండి

West Indies Cricket: దేశం వద్దు లీగ్‌లే ముద్దు, కాంట్రాక్టులు వద్దన్న విండీస్‌ క్రికెటర్లు

West Indies Cricket: దేశం వద్దు లీగ్‌లే ముద్దు, కాంట్రాక్టులు వద్దన్న విండీస్‌ క్రికెటర్లు

Rohit Sharma: ఫిట్‌ గురూ కోహ్లీనే, రోహిత్‌ కూడా ఫుల్‌ ఫిట్‌

Rohit Sharma: ఫిట్‌ గురూ కోహ్లీనే,   రోహిత్‌ కూడా ఫుల్‌ ఫిట్‌

Travis Head: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ హెడ్‌ , భారత పేసర్ షమీకి తప్పని నిరాశ

Travis Head: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ హెడ్‌ , భారత పేసర్ షమీకి తప్పని నిరాశ

Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్

Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి  ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్,  సోషల్ మీడియాలో ట్రెండింగ్

SA vs IND, 1st T20I: మీ దగ్గర కవర్లకు కూడా డబ్బులు లేవా , దక్షిణాఫ్రికా బోర్డుపై గవాస్కర్‌ ఆగ్రహం

SA vs IND, 1st T20I: మీ దగ్గర కవర్లకు కూడా డబ్బులు లేవా , దక్షిణాఫ్రికా బోర్డుపై గవాస్కర్‌ ఆగ్రహం

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు