IND vs ENG 5th Test: మొదలైన అశ్విన్ మాయ, ఇన్నింగ్స్ ఓటమి ఖాయమేనా?
Ravichandran Ashwin : భారత్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. అశ్విన్ మాయాజాలం ప్రారంభం కావడంతో వరుసగా వికెట్లు కోల్పోతుంది.
![IND vs ENG 5th Test: మొదలైన అశ్విన్ మాయ, ఇన్నింగ్స్ ఓటమి ఖాయమేనా? IND vs ENG 5th Test Ravichandran Ashwin On Fire As England Go 3 Down India On Top IND vs ENG 5th Test: మొదలైన అశ్విన్ మాయ, ఇన్నింగ్స్ ఓటమి ఖాయమేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/8c9336a98ad1f0721aa8063f8bc997251709963236839872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ravichandran Ashwin : భారత్ (Bharat)వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్(England) ఓటమి దిశగా పయనిస్తోంది. అశ్విన్(Ravi chandran Ashwin) మాయాజాలం ప్రారంభం కావడంతో వరుసగా వికెట్లు కోల్పోతుంది. అశ్విన్ మూడు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్ స్టో.. రూట్ ఇంగ్లాండ్ కు ఇన్నింగ్స్ పరాజయం తప్పించేందుకు పోరాడుతున్నారు. కానీ పిచ్ స్పిన్ కు సహకరిస్తున్న వేళ టీం ఇండియా స్టార్ స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదు.
ధర్మశాల టెస్టు(Dharmashala test)లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమైన చోట మనోళ్లు శతక గర్జన పూరించారు. కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌గిల్ సూపర్ సెంచరీలతో చెలరేగిన వేళ..టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్ళింది. తొలి ఇన్నింగ్స్ 477 పరుగుల వద్ద ముగిసింది. 437/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 40 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది.
ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 218 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. వికెట్ నష్టానికి.... 135 పరుగుల వద్ద భారత్ జట్టు బ్యాటింగ్ కొనసాగించగా..రెండో వికెట్‌కు రోహిత్, శుభ్‌మన్ గిల్ 171 పరుగులు జోడించారు. ఈ క్రమంలో.. ఇద్దరూ శతకాలతో రాణించారు. రోహిత్ 103, గిల్ 110 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరగా.. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్‌ఖాన్ అర్ధ శతకాలతో మెరిశారు.
టెస్టు క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనేఅర్ధ శతకం సాధించిన పడిక్కల్ 65 పరుగులు చేయగా సర్ఫరాజ్ 56 పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత జడేజా, ధ్రువ్ జురేల్, అశ్విన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా చివర్లో కుల్‌దీప్ యాదవ్, బుమ్రా ఇంగ్లాండ్ బౌలర్లను గట్టిగా ప్రతిఘటించారు. 437/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 40 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. చివరి వికెట్‌గా వెనుదిరిగిన బుమ్రా 20 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లు పడగొట్టగా జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్‌లీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 259 పరుగుల ఆధిక్యం లభించింది.
హిట్‌మ్యాన్ హిట్
రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 12వ శతకం. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 48వ సెంచరీ. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే సిక్సర్ల కింగ్‌లా పేరు గడించిన హిట్‌మ్యాన్ మరో అరుదైన రికార్డున తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)