News
News
X

IND vs END Semi final: టాస్‌ లక్కు ఇంగ్లాండ్‌దే! తొలి బ్యాటింగ్‌ ఎవరిదంటే?

IND vs END Semi final: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 రెండో సెమీస్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

FOLLOW US: 
 

 IND vs END Semi final: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 రెండో సెమీస్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గాయాలతో డేవిడ్‌ మలన్‌, మార్క్‌వుడ్‌ దూరమయ్యారని తెలిపాడు. ఫిల్‌సాల్ట్‌, జోర్డాన్‌ జట్టులోకి వచ్చారన్నాడు. ఎలాగైనా తాము తొలుత బ్యాటింగే చేయాలని భావించామని రోహిత్‌ శర్మ తెలిపాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదన్నాడు. జింబాబ్వేపై ఆడితో జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు.

తుది జట్లు

భారత్‌: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్ షమి, అర్షదీప్‌ సింగ్‌

ఇంగ్లాండ్‌: జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌, ఫిలిప్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, హ్యారీ బ్రూక్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌

News Reels

ఇంగ్లండ్ పై భారత్ దే పైచేయి

రికార్డుల ప్రకారం ఇంగ్లిష్ జట్టుపై టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. టీ20 , వన్డే ఫార్మాట్లలో ఇంగ్లండ్ పై భారత్ ఆధిక్యంలో ఉంది. 

రెండు జట్లు 22 టీ20ల్లో తలపడగా భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 సార్లు విజయం సాధించాయి.
 
టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తో 3 సార్లు తలపడిన టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. 

సెమీఫైనల్ వేదిక అయిన అడిలైడ్ లో ఇంగ్లండ్ రికార్డు అంత బాగా లేదు.  ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మాత్రమే గెలిచింది. ఇది భారత్ కు కలిసొచ్చే అంశం. 

అడిలైడ్ మైదానంలో విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. 

ఇదే ప్రపంచకప్ లో ఈ వేదికపై బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఈ వేదికపై ఆడలేదు. 

ఇవన్నీ టీమిండియాకు సానుకూలాంశాలు. ఫైనల్ గా రికార్డులు ఎలా ఉన్నా.. ఆరోజు ఎవరు ఎలా ఆడారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంది. కాబట్టి టీమిండియా తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇంగ్లండ్ పై గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

బ్యాటింగ్ లో ఆ ఒక్కరు తప్ప

భారత బ్యాటింగ్ ను ప్రస్తుతం కలవరపెడుతున్న అంశం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. సూపర్- 12 లో జరిగిన 5 మ్యాచుల్లో 4 సార్లు రోహిత్ విఫలమయ్యాడు. పసికూన నెదర్లాండ్స్ పై మాత్రమే అర్థశతకం సాధించాడు. ఈ విషయం ఇప్పుడు జట్టుతో పాటు అభిమానులను కలవరపెడుతోంది. కీలకమైన నాకౌట్ మ్యాచులో భారత కెప్టెన్ కచ్చితంగా రాణించాల్సిందే. అయితే రాహుల్ ఫాం అందుకోవడం.. కోహ్లీ, సూర్య సూపర్ టచ్ లో ఉండడం భారత్ కు సానుకూలాంశం. హార్దిక్ పాండ్య ఆల్ రౌండ్ మెరుపులు ఇప్పటివరకు కనిపించలేదు. బౌలింగ్ లో కీలక సమయంలో వికెట్లు తీస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది. 

ఆ ఇద్దరిలో ఎవరు?

దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్.. భారత జట్టు యాజమాన్యం ఇప్పుడు వీరిద్దరి విషయంలో డైలమాలో ఉంది. ఫినిషర్ గా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. ఇప్పటివరకు ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. జింబాబ్వేతో జరిగిన చివరి లీగ్ మ్యాచులో చోటు దక్కించుకున్న పంత్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు కీలకమైన సెమీస్ లో వీరిద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై యాజమాన్యం తర్జనభర్జనలు పడుతోంది.  ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచులో సీనియర్ అయిన దినేశ్ కార్తీక్ వైపు చూసే అవకాశాలు అధికం. అయితే కుడి, ఎడమ కాంబినేషన్ కావాలనుకుంటే మాత్రం పంత్ ను తీసుకునే అవకాశం ఉంది. 

పేస్ సూపర్.. స్పిన్ డల్

ఈ మెగాటోర్నీలో మన పేస్ దళం అంచనాలను మించి రాణిస్తోంది. సీనియర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీతో పాటు అర్హ్ దీప్ సింగ్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. భువి పవర్ ప్లే లో పరుగులు కట్టడి చేస్తుంటే.. అర్ష్ దీప్ ఆరంభంలోనే వికెట్లు పడగొడుతున్నాడు. ఇక షమీ మధ్య, ఆఖరి ఓవర్లలో రాణిస్తున్నాడు. నాలుగో పేసర్ గా హార్దిక్ పాండ్య కీలక సమయంలో వికెట్లు తీస్తూ బ్రేక్ ఇస్తున్నాడు. అయితే స్పిన్నర్లు రాణించకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. మిగతా జట్ల స్పిన్నర్లు అదరగొడుతున్న పిచ్ లపై మన స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్ లు తేలిపోతున్నారు. అన్ని మ్యాచులకు జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలేదు. ఇక అక్షర్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో విఫలమవుతున్నాడు. మరి సెమీస్ కు అక్షర్ ను పక్కనపెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన చాహాల్ ను తీసుకుంటారేమో చూడాలి. 

Published at : 10 Nov 2022 01:07 PM (IST) Tags: India vs England IND vs END ADELAIDE #T20 World Cup 2022 T20 World Cup Semi-final IND vs END highlights IND vs END T20 IND vs END Semi-final

సంబంధిత కథనాలు

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

IND Vs BAN 1st ODI: ఇంతకంటే ఘోర ఓటమి ఇంకెప్పుడూ రాదేమో - ఒక్క వికెట్ తేడాతో బంగ్లా విజయం!

IND Vs BAN 1st ODI: ఇంతకంటే ఘోర ఓటమి ఇంకెప్పుడూ రాదేమో - ఒక్క వికెట్ తేడాతో బంగ్లా విజయం!

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

Viral Video: పాత బంతిని షైన్ చేసేందుకు కొత్త టెక్నిక్ కనిపెట్టిన జో రూట్- మీరు చూశారా!

Viral Video: పాత బంతిని షైన్ చేసేందుకు కొత్త టెక్నిక్ కనిపెట్టిన జో రూట్- మీరు చూశారా!

IND vs BAN 1st ODI: ముగిసిన 25 ఓవర్ల ఆట- తడబడిన టీమిండియా టాపార్డర్- స్కోరు ఎంతంటే!

IND vs BAN 1st ODI: ముగిసిన 25 ఓవర్ల ఆట- తడబడిన టీమిండియా టాపార్డర్- స్కోరు ఎంతంటే!

టాప్ స్టోరీస్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

10 రోజులు టైమ్ ఇస్తున్నా, దమ్ముంటే అవినీతి నిరూపించు: బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?