IND vs BAN T20 WC: గత రికార్డులు చూస్తే బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయి కానీ...!
IND vs BAN T20 WC: టీ20 ప్రపంచకప్ లో భాగంగా రేపు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య 11 టీ20 మ్యాచులు జరగ్గా.. భారత్ 10 విజయాలు సాధించింది. బంగ్లా ఒక్క గెలుపుతో సరిపెట్టుకుంది.
![IND vs BAN T20 WC: గత రికార్డులు చూస్తే బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయి కానీ...! IND vs BAN T20 World Cup 2022 India vs Bangladesh Head to Head Records Win Loss Stats T20 WC All You Need To know IND vs BAN T20 WC: గత రికార్డులు చూస్తే బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయి కానీ...!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/01/9fcd2e53a51260456dc833c4dc5037151667291395413543_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs BAN T20 WC: టీ20 ప్రపంచకప్ లో భాగంగా రేపు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. నవంబర్ 2న మధ్యాహ్నం 1.30 కు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియానే ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. గత రికార్డులూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 11 టీ20 మ్యాచులు జరగ్గా.. భారత్ 10 విజయాలు సాధించింది. బంగ్లా ఒక్క గెలుపుతో సరిపెట్టుకుంది. రేపు మ్యాచ్ సందర్భంగా ఇంతకుముందు గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇప్పటివరకు భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు చూద్దాం.
1. అత్యధిక స్కోరు: 2009 జూన్ 6న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
2. అత్యల్ప స్కోరు: 2016 ఫిబ్రవరి 24న మీర్ పూర్ లో జరిగిన టీ20లో బంగ్లాదేశ్ జట్టు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.
3. అతిపెద్ద విజయం: 2016 ఫిబ్రవరిలో మీర్ పూర్ లో జరిగిన టీ20లో బంగ్లా జట్టును టీమ్ఇండియా 45 పరుగుల తేడాతో ఓడించింది. పరుగుల పరంగా భారత్ కు ఇదే అతిపెద్ద విజయం. 2014 మార్చిలో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలిచింది. వికెట్ల పరంగా ఇది అతిపెద్ద విజయం.
4. అత్యధిక పరుగులు: బంగ్లాదేశ్ తో జరిగిన టీ20ల్లో రోహిత్ శర్మ 452 పరుగులు చేశాడు. అప్పుడు అతని బ్యాటింగ్ సగటు 41.09, స్ట్రైక్ రేట్ 144.40.
5. ఉత్తమ ఇన్నింగ్స్: మార్చి 2018లో కొలంబోలో జరిగిన టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ 61 బంతుల్లో 89 పరుగులు చేశాడు.
6. అత్యధిక 50+ పరుగుల ఇన్నింగ్స్: ఈ రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే నమోదైంది. బంగ్లాదేశ్ పై హిట్ మ్యాన్ 5 సార్లు 50+ పరుగులు చేశాడు.
7. అత్యధిక సిక్సర్లు: ఈ రికార్డూ ప్రస్తుత కెప్టెన్ పేరు మీదే ఉంది. బంగ్లాదేశ్ పై రోహిత్ 21 సిక్సర్లు బాదాడు.
8. అత్యధిక వికెట్లు: భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచుల్లో యుజ్వేంద్ర చాహల్ 9 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని బౌలింగ్ సగటు 17, ఎకానమీ రేటు 6.37.
9. ఉత్తమ బౌలింగ్: నవంబర్ 2019లో నాగ్ పూర్ టీ20లో దీపక్ చాహర్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.
10. వికెట్ వెనుక అత్యధిక వికెట్లు: ఎంఎస్ ధోనీ 5 మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. 3 క్యాచులు అందుకుని, 4 స్టంపింగ్ లు చేశాడు.
When the #Hitman takes the crease for Team India, you just sit back and enjoy the show! 🍿@ImRo45 | ICC Men's #T20WorldCup | #BelieveInBlue | #INDvBAN | Nov 2, 1 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/22mvHu4DUP
— Star Sports (@StarSportsIndia) October 31, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)