![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs BAN 3rd ODI: పరువు నిలిచేనా! నేడు బంగ్లాతో ఆఖరి వన్డేకు సిద్ధమైన భారత్
ఓ వైపు వైట్ వాష్ భయం.. మరో వైపు గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం... ఇంకో వైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమష్టి వైఫల్యం. వెరసి ఇన్ని భయాల మధ్య బంగ్లాదేశ్ తో ఆఖరిదైన మూడో వన్డేకు సిద్ధమైంది భారత్.
IND vs BAN 3rd ODI: ఓ వైపు వైట్ వాష్ భయం.. మరో వైపు గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం... ఇంకో వైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమష్టి వైఫల్యం. వెరసి ఇన్ని భయాల మధ్య బంగ్లాదేశ్ తో ఆఖరిదైన మూడో వన్డేకు సిద్ధమైంది భారత్. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇక ఆడాల్సింది పరువు నిలుపుకోవడం కోసమే. అయితే సమష్టి వైఫల్యంతో రెండు వన్డేల్లోనూ గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిన మన జట్టు ఆఖరి వన్డేలో ఏమాత్రం ఆడుతుందో చూడాలి.
రెండు వన్డేల్లో భారత్ ఓటములకు ఏ ఒక్కరినో బాధ్యులను చేయడం భావ్యం కాదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమష్టి వైఫల్యం టీమిండియా కొంప ముంచింది. మరోవైపు బంగ్లా పోరాట తత్వంతో ఓడాల్సిన మ్యాచ్ లను గెలిచి సిరీస్ నెగ్గింది. నేడు ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో ఇరు జట్ల గురించి ఓసారి చర్చిద్దాం
బ్యాటింగ్ లో ఒకరిద్దరే
కాగితంపై బలంగా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్... మైదానంలోకి వచ్చేసరికి తుస్సుమనిపించే ప్రదర్శన చేస్తోంది. కెప్టెన్ రోహిత్ ఇప్పటికే దూరమయ్యాడు. శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కోహ్లీ, రాహుల్ లు అంతంతమాత్రంగానే ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే నిలకడగా పరుగులు చేస్తున్నాడు. రెండో వన్డేలో అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు. ఇక ఆల్ రౌండర్లుగా పేరున్న శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ లు తేలిపోయారు. ఈ మ్యాచులో గెలిచి పరువు నిలుపుకోవాలంటే వీరందరూ బ్యాట్ ఝుళిపించాల్సిందే
'తోక' తెంచలేకపోతున్న బౌలర్లు
మొదటి 10, 20 ఓవర్ల వరకు బాగా బౌలింగ్ చేస్తున్న టీమిండియా బౌలర్లు మధ్య, చివరి ఓవర్లలో చేతులెత్తేస్తున్నారు. తొలి వన్డేలో ఒక్క వికెట్ పడగొట్టలేక బంగ్లాకు మ్యాచును అప్పగించేశారు. ఇక రెండో వన్డేలో అయితే 69 పరుగులకు 6 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు... చివరకు 271 పరుగులు ఇచ్చారు. ప్రధాన బౌలర్ అనుకున్న దీపక్ చాహర్ గాయంతో దూరమయ్యాడు. శార్దూల్ ఠాకూర్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వికెట్లు తీయడంలేదు. ఇక సిరాజ్ వికెట్లు తీస్తున్నప్పటికీ భారీగా పరుగులిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ కూడా అంతే. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ జట్టుతో చేరాడు. అతను ప్లేయింగ్ ఎలెవన్ లో ఉంటే స్పిన్ బలోపేతమవుతుంది.
జోష్ లో బంగ్లా
బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా కంటే బంగ్లాదేశ్ మెరుగైన ఆటతీరు కనబరుస్తోంది. ముఖ్యంగా మెహదీ హసన్ మిరాజ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. మహమ్మదుల్లా మంచి ఫాంలో ఉన్నాడు. షకీబుల్ హసన్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీంలు టచ్ లోకి వస్తే భారత్ కు ప్రమాదమే. బౌలింగ్ లోనూ ఆ జట్టు నిలకడైన ఆట ఆడుతోంది. ముస్తాఫిజర్ పవర్ ప్లే, డెత్ ఓవర్లలో సూపర్ గా బౌలింగ్ చేస్తున్నాడు. మొత్తానికి సమష్టిగా ఆడి సిరీస్ చేజిక్కించుకున్న బంగ్లా... క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని అంత తేలికగా వదులుకోదు. కాబట్టి టీమిండియాకు మరో గట్టి పోటీ తప్పదు.
పిచ్ పరిస్థితి
ఈ మ్యాచ్ చట్టోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. బంగ్లాదేశ్ చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఇక్కడ ఆడింది. ఆ సిరీస్‌లో 6 ఇన్నింగ్సుల్లో ఒకసారి మాత్రమే 300 స్కోరు నమోదైంది. వర్షం పడే సూచనలు లేవు.
బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా)
నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
భారత్ తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్/రాహుల్ త్రిపాఠి, కేఎల్. రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
Learning from one of the best! 👌 👌@Sundarwashi5 gets some batting tips from Head Coach Rahul Dravid 👍 👍#TeamIndia | #BANvIND pic.twitter.com/YgvZRNKyfr
— BCCI (@BCCI) December 9, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)