Nitish Kumar Reddy Ruled out: టీమిండియాకు ఎదురుదెబ్బ! తొలి 3 మ్యాచ్ లకు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దూరం
India vs Australia T20I Series | యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా తొలి మూడు టీ20లకు దూరం, సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

Nitish Reddy Ruled Out Of 3 Matches | కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ నేడు ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. అయితే మొదటి బంతిని వేయడానికి ముందే ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
హార్ధిక్ కోలుకోలేదు.. నితీష్ రెడ్డికి గాయం
ఆసియా కప్ 2025 ఫైనల్స్‌కు ముందు గాయపడిన హార్దిక్ పాండ్యా ఇప్పటికీ ఆసీస్ పర్యటనలకు అందుబాటులో లేడు. అతని స్థానంలో తెలుగు తేజం, యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. కానీ గాయం కారణంగా నితీష్ రెడ్డి తొలి మూడు T20 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. సిరీస్ ప్రారంభానికి ముందు భారత్‌కు ఇది మైనస్ పాయింట్ కానుంది. నితీష్ అందుబాటులో ఉంటే అటు బ్యాట్, ఇటు బంతితో జట్టుకు సేవలు అందించేవాడు.
BCCI ఒక ట్వీట్ చేసింది. "ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మొదటి 3 T20Iలకు దూరం కానున్నాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో ఎడమ క్వాడ్రిస్ప్స్ గాయం నుంచి కోలుకుంటున్న నితీష్ రెడ్డి మెడకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. BCCI వైద్య బృందం నితీష్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. నితీష్ త్వరలోనే మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడని" పేర్కొంది.
🚨 Update
— BCCI (@BCCI) October 29, 2025
Nitish Kumar Reddy has been ruled out for the first three T20Is. The all-rounder who was recovering from his left quadriceps injury sustained during the second ODI in Adelaide, complained of neck spasms, which has impacted his recovery and mobility. The BCCI Medical… pic.twitter.com/ecAt852hO6
భారత్ తప్పక గెలవాల్సిన రెండో వన్డేలో రెడ్డి 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి, 3 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 24 పరుగులు ఇచ్చాడు, అతని ఎకానమీ రేట్ 8.00గా ఉంది. అర్ష్‌దీప్ సింగ్ విషయానికొస్తే, అతని గురించి BCCI ఎలాంటి అధికారిక అప్‌డేట్ ఇవ్వలేదు. ఎడమచేతి వాటం పేసర్ స్వల్ప ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను కొంచెం ఇబ్బంది పడ్డాడు. మెడికల్ స్టాఫ్ వచ్చి గ్రౌండ్ లోకి వచ్చి చెక్ చేసి వెళ్లడం తెలిసిందే..
టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు సన్నద్ధమవుతోంది. టీ20 ఫార్మాట్లో నెంబర్ 1 జట్టు అయిన ఇండియాతో తలపడుతున్నాం. అందుకే ఈ సిరీస్ లో గట్టి పోటీ తప్పదు. టాస్ గెలిస్తే కచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకున్నాం అని ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు.
ప్లేయింగ్ XIలు
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (సి), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (w), కూపర్ కానోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.





















