IND vs AUS 1st T20 live streaming: నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్.. ఎక్కడ చూడాలి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
INDIA vs AUSTRALIA 1st T20 Timing and Venue:భారత్ ఆస్ట్రేలియా తొలి టీ20 కాన్‌బెర్రాలో జరగనుంది. వన్డే సిరీస్ ఓడిన టీమిండియా ఎలాగైనా టీ20 సిరీస్ నెగ్గాలని బరిలోకి దిగుతోంది.

IND vs AUS 1st T20 live streaming: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. మొదటి T20 మ్యాచ్ బుధవారం నాడు ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరుగుతుంది. టీమిండియా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ T20 సిరీస్‌ను ఆడటానికి ఆస్ట్రేలియాకు వెళ్ళింది. భారత్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. భారత జట్టు కాన్‌బెర్రాలో విజయంతో టీ20 సిరీస్ ప్రారంభించాలని భావిస్తోంది.
మొదటి T20 ఎక్కడ నిర్వహిస్తున్నారు
భారత్, ఆస్ట్రేలియా జట్ల (IND vs AUS T20) మధ్య మొదటి T20 మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ స్టేడియంలో జరుగుతుంది.
మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టాస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు వేస్తారు. టాస్ వేసిన తర్వాత అరగంటకు అంటే మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు టీ20 మ్యాచ్ ప్రారంభమవుతుంది.
టీవీలో లైవ్ ఎక్కడ చూడాలి?
భారత్ vs ఆస్ట్రేలియా తొలి T20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network)లో లైవ్ ప్రసారం చేస్తారు. దీంతో పాటు ప్రేక్షకులు DD స్పోర్ట్స్ (DD Sports)లో ఈ మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు.
ఏ OTT ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమింగ్?
భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ OTT ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఉంటుంది.
T20 సిరీస్ కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.
T20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు
మిచ్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, బెన్ డ్వార్‌ష్యూస్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, మాథ్యూ కుహ్నెమన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.
T20 ప్రపంచ ఛాంపియన్ భారత్
భారత జట్టు T20 ఇంటర్నేషనల్‌లో గత ఏడాది నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. భారత్ ప్రస్తుతం T20ల్లో ప్రపంచ ఛాంపియన్. టీమిండియా T20 ప్రపంచ కప్ 2024ని గెలుచుకుంది. ఆ తరువాత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. జడేజా, కోహ్లీ సైతం రిటైర్మెంట్ ఇచ్చారు. అప్పటినుంచి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ నిలకడగా రాణిస్తోంది. ఇటీవల సూర్య కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది.





















