IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!
IND vs AUS: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యంత కీలకమైన సిరీసుకు వేళైంది! పటిష్ఠమైన భారత్, ఆస్ట్రేలియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి. టోర్నీ పూర్తి షెడ్యూలు మీకోసం!
IND vs AUS:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యంత కీలకమైన సిరీసుకు వేళైంది! పటిష్ఠమైన భారత్, ఆస్ట్రేలియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి. నాలుగు టెస్టుల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడనున్నాయి. ఈ సిరీసులో గెలిచినవాళ్లకు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
కొనసాగుతున్న క్యాంపులు
ఈ ప్రతిష్ఠాత్మక సిరీసుకు భారత్ ఆతిథ్యమిస్తోంది. తొలి టెస్టు నాగ్‌పుర్‌లో జరగనుంది. ఇప్పటికే కంగారూలు ఉపఖండంలో అడుగుపెట్టారు. బెంగళూరులో ఐదు రోజుల శిబిరంలో ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నారు. ఫిబ్రవరి 6న నాగ్‌పుర్‌కు చేరుకుంటారు. మరోవైపు టీమ్‌ఇండియా క్రికెటర్లు క్యాంపుకు చేరిపోయారు. కొత్తపెళ్లి కొడుకు కేఎల్ రాహుల్, కింగ్ విరాట్ కోహ్లీ జట్టుతో కలిశారు.
మైండ్‌గేమ్స్ షురూ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అంటేనే మైండ్ గేమ్‌కు పెట్టింది పేరు. ఆసీస్ మాజీ క్రికెటర్లు భారత పిచ్‌లపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమ్‌ఇండియా మాజీలూ ధాటిగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు టెస్టులు, మూడు వన్డేల వేదికలు, తేదీలు, జట్ల వివరాలు మీకోసం!
టెస్టు, వన్డే వేదికలు, తేదీలు
భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు నాగ్‌పుర్‌లో జరుగుతుంది. ఫిబ్రవరి 9న మొదలవుతుంది. రెండో మ్యాచ్ వేదిక దిల్లీ. ఫిబ్రవరి 17న మ్యాచ్ ఆరంభం అవుతుంది. ధర్మశాలలో మూడో టెస్టు ఉంటుంది. మార్చి 1న మొదలవుతుంది. నాలుగో టెస్టు మార్చి 9న ఉంటుంది. అహ్మదాబాద్‌లోని మొతేరా వేదిక. టెస్టు సిరీస్ ముగిసిన ఐదు రోజులకే వన్డేలు మొదలవుతాయి. మార్చి 17, 19, 22న ఉంటాయి. వాంఖడే, విశాఖపట్నం, చెన్నై ఇందుకు వేదికలు.
మ్యాచ్ టైమింగ్స్
టెస్టు మ్యాచులు ఉదయం 9:30 గంటలకు మొదలవుతాయి. వన్డేలన్నీ డే/నైట్ ఫార్మాట్లో జరుగుతాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభమవుతాయి.
Also Read: ఏంటీ పోటీ! WPL వేలంలో 90 మందికి 1000 పేర్లు నమోదు!
Also Read: కోలుకున్న బుమ్రా- ఆసీస్ తో చివరి 2 టెస్టులకు అందుబాటులోకి పేసు గుర్రం!
రెండు జట్లు
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, చెతేశ్వర్ పుజారా, శుభ్ మన్ గిల్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్
ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), ఏస్టన్ ఆగర్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్, లాన్స్ మోరిస్, టా్ మర్ఫీ, మ్యాట్ రెన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్
#TeamIndia have begun their preparations for the Border Gavaskar Trophy ahead of the 1st Test in Nagpur.#INDvAUS pic.twitter.com/21NlHzLwGA
— BCCI (@BCCI) February 3, 2023