అన్వేషించండి

IND vs AUS, 1st ODI: దిస్‌ ఈజ్‌ కేఎల్‌! 16/3తో విలవిల్లాడిన వేళ గెలిపించిన 'రాహుల్‌ - రవీంద్ర'!

IND vs AUS, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్‌ఇండియా సూపర్‌ డూపర్‌ విక్టరీ సాధించింది. మూడు మ్యాచుల సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

IND vs AUS, 1st ODI: 

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్‌ఇండియా సూపర్‌ డూపర్‌ విక్టరీ సాధించింది. వాంఖడేలో దుమ్మురేపింది. మూడు మ్యాచుల సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సాధికారికంగా ఛేదించింది. సీమ్‌, స్వింగ్‌తో ఆసీస్‌ పేసర్లు వణికించిన వేళ.. ఓడిపోతామేమోనని ఆందోళన చెందిన వేళ.. కేఎల్‌ రాహుల్‌ (75; 91 బంతుల్లో 7x4, 1x6) నిలబడ్డాడు. తనకిష్టమైన ముంబయిలో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రవీంద్ర జడేజా (45; 69 బంతుల్లో 5x4) అతడికి అండగా నిలిచాడు. అంతకు ముందు ఆసీస్‌లో మిచెల్‌ మార్ష్‌ (81: 65 బంతుల్లో 10x4, 5x6) ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్‌ షమి, సిరాజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

టాప్‌ ఆర్డర్‌.. టపటపా!

వాంఖడేలో ఛేదనంటే గుర్తొచ్చేదేంటి! మంచు కురుస్తుంది కాబట్టి ఎంతటి టార్గెట్టైనా ఈజీగా ఛేజ్‌ చేయొచ్చు! కానీ ఈసారి అలా ఏం జరగలేదు! పిచ్‌, కండిషన్స్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించాయి. దాంతో ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌ (3/49), మార్కస్‌ స్టాయినిస్‌ (2/27) బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఐదు పరుగుల వద్దే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (3)ను స్టాయినిస్‌ ఎల్బీ చేశాడు. ఐదో ఓవర్లో వరుస బంతుల్లో విరాట్‌ కోహ్లీ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (0)ను మిచెల్‌ స్టార్క్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చక్కని లెంగ్తుల్లో బంతులేశాడు. ఈ సిచ్యువేషన్లో కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌ (20; 31 బంతుల్లో 3x4) చిన్న భాగస్వామ్యం నెలకొల్పారు. 38 వద్ద గిల్‌ను స్టార్క్‌ ఔట్‌ చేయడంతో టీమ్‌ఇండియా ఒత్తిడికి గురైంది.

జడ్డూ అండగా రాహుల్‌ టాప్‌ క్లాస్‌!

కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియాను కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య ఆదుకున్నారు. రాహుల్‌ తనదైన రీతిలో బంతుల్ని డిఫెండ్‌ చేశాడు. పరిస్థితులకు తగ్గట్టు బంతులేస్తున్న బౌలర్లను గౌరవించాడు. అనవసర షాట్లు ఆడలేదు. మరోవైపు పాండ్య కాస్త దూకుడుగా ఆడాడు. పిచ్‌ ఈజీగా ఉన్నట్టు ప్రవర్తిస్తూ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఐదో వికెట్‌కు 55 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని జట్టు స్కోరు 83 పాండ్యను ఔట్‌ చేయడం ద్వారా స్టాయినిస్‌ విడదీశాడు. ఇక్కడ్నుంచి కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా తమ అసలైన ఆటతీరును బయటకు తీశారు. ఆఫ్‌సైడ్‌ స్వింగ్‌ అవుతున్న బంతుల్ని వదిలేశారు. చెత్త బంతుల్ని మాత్రమే వేటాడారు. సింగిల్స్‌, డబుల్స్‌ రొటేట్‌ చేశారు. జట్టు స్కోరు 100 దాటించారు. ఆపై 150ని అధిగమించారు. 73 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాక కేఎల్‌ కొన్ని బౌండరీలు బాదడంతో గెలుపు ఖాయమైంది. జడ్డూ సైతం బాగా ఆడటంతో ఈ జోడీ 123 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. 61 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలిపించింది.

మిచెల్‌ మార్ష్‌ కేక

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌‌ను (5: 10 బంతుల్లో, ఒక ఫోర్) మహ్మద్‌ సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. మంచి లెంత్‌లో పడిన బంతిని మిడిల్‌ చేసేందుకు ట్రావిస్ హెడ్‌ ప్రయత్నించాడు. అయితే బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి నేరుగా వికెట్లను లేపేసింది. మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (81: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రం సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. కాస్త నిలదొక్కుకున్నాక చక్కని షాట్లు బాదేశాడు. బౌండరీలు, సిక్సర్లతో మోత మోగించాడు. అతడికి స్టీవ్‌ స్మిత్‌ (22; 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్మిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా రవీంద్ర జడేజా విడదీశాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్‌ (15: 22 బంతుల్లో, ఒక ఫోర్) అండతో మార్ష్‌ రెచ్చిపోయాడు. 51 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆపై ఎడాపెడా బాదేసి స్కోరు వేగం పెంచాడు. దాంతో 16.4 ఓవర్లకు ఆసీస్‌ 100 పరుగుల మైలురాయి అధిగమించింది.

మన బౌలర్లూ భళా!

జట్టు స్కోరు 139 వద్ద మార్నస్ లబుషేన్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ బుట్టలో పడేశాడు. చక్కని లెంగ్తులో వచ్చిన బంతిని డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించిన మార్షన్ లబుషేన్‌ కుదరకపోవడంతో గాల్లోకి ఆడేశాడు. దానికి రవీంద్ర జడేజా డైవ్‌ చేసి ఒడిసిపట్టాడు. మరో 10 పరుగులకే మార్ష్‌ను జడేజా అవుట్‌ చేశాడు. సిక్సర్‌ బాదే క్రమంలో బ్యాటు అంచుకు తగిలిన బంతి థర్డ్‌మ్యాన్‌ వైపు లేచింది. దానిని మహ్మద్ సిరాజ్‌ పట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియా 139 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన జాన్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్ కాసేపు బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అయితే వీరు అవుటయ్యాక ఆస్ట్రేలియా ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక దశలో 169 పరుగులకు నాలుగు వికెట్లతో కనిపించిన ఆస్ట్రేలియా కేవలం 19 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయింది. మహ్మద్ షమీ, సిరాజ్ ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ వెన్ను విరిచారు. దీంతో ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Embed widget