అన్వేషించండి
Advertisement
ICC World Cup 2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ శుభారంభం, తొలిమ్యాచ్‌లో అఫ్గాన్‌పై అలవోక విజయం
BAN vs AFG
వన్డే ప్రపంచకప్‌లో పోరును బంగ్లాదేశ్ ఘన విజయంతో ప్రారంభించింది. ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. మొదట అఫ్గాన్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్.. ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 37.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే కుప్పకూలగా.. బంగ్లా 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కుప్పకూలిన అఫ్గాన్
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ అఫ్గానిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్ 156 పరగులకే కుప్పకూలింది. అఫ్గాన్ జట్టుకు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జర్దాన్ శుభారంభం ఇచ్చారు. బంగ్లా పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 62 బంతుల్లో 47 పరుగులు చేసి అర్ధ శతకం వైపు దూసుకుపోతున్న గుర్భాజ్‌ను ముస్తాఫిజుర్ అవుట్ చేసి అఫ్గాన్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. తర్వాత కూడా అఫ్గాన్ బ్యాటింగ్ సాఫీగానే సాగింది. జర్దాన్‌తో కలిసి రహ్మత్ షా ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. కానీ రహ్మత్ షాని అవుట్ చేసి షకీబుల్ హసన్ అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. 18 పరుగులు చేసిన హస్మతుల్లా షాహిదీ, 22 పరుగులు చేసిన ఇబ్రహీం జర్దాన్ కూడా అవుటవ్వడంతో అఫ్గాన్ 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 112 పరుగుల వద్దే అఫ్గాన్ మూడు వికెట్లు కోల్పోయింది. 126 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు పెవీలియన్ బాట పట్టారు. అమ్రాతుల్లా ఒమ్రాజాయ్ 22 పరుగులతో వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించినా అది ఎంతోసేపు నిలవలేదు. రషీద్ ఖాన్ 9, రహమాన్ 1, నవీన్ ఉల్ హక్ డకౌట్‌గా వెనుదిరగడంతో.156 పరుగులకే అఫ్గాన్ కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో హసన్ మీరాజ్ 3, షకీబ్ అల్ హసన్ 3 వికెట్లతో రాణించారు. వీరి ధాటికి ఏ ఒక్క అఫ్గాన్ బ్యాటర్ కూడా అర్ధ శతకం సాధించలేదు. ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేదు.
అలవోకగా ఛేదించిన బంగ్లా...
అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్... బంగ్లా మరో 92 ఓవర్లు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా ఓపెనర్లు తస్కిన్ అహ్మద్ ఆరు, లిట్టన్ దాస్ 13 పరుగులకే వెనుదిరగడంతో అఫ్గాన్ పోటీలోకి వచ్చినట్లు అనిపించింది. కానీ మహిది హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో అర్ధ శతకాలతో సమయోచితంగా ఆడడంతో బంగ్లా లక్ష్యం దిశగా సాగింది. అఫ్గాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు చేసింది. రషీద్ ఖాన్, నబీ స్పిన్‌ను కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. లక్ష్యం మరీ తక్కువగా ఉండడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ ఇద్దరు ఆటగాళ్లు బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్లను ఆచితూచి ఆడిన హసన్ మిరాజ్, శాంటో పేసర్లపై మాత్రం ఆధిపత్యం చెలాయించారు.
కానీ విజయానికి మరో 32 పరుగులు కావాల్సిన దశలో 57 పరుగులు చేసిన మహిది హసన్ మిరాజ్ అవుట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్... మిరాజ్‌ను పెవీలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. విజయానికి మరో 11 పరుగులు కావాల్సిన దశలో షకీబ్ అవుట్ అయ్యాడు. కానీ చివరి వరకు క్రీజులో ఉన్న నజ్ముల్ హుస్సేన్ శాంటో 59 పరుగులతో అజేయంగా నిలిచి బంగ్లాదేశ్‌కు ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే విజయం అందించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
వరంగల్
రైతు దేశం
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement