Mohammad Kaif: వారికి ఆ తేడా తెలిసింది- ఇప్పుడు డూప్లికేట్ జడేజా కోసం వెతకరు: కైఫ్
తొలి టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు డూప్లికేట్ కు, ఒరిజినల్ కు మధ్య తేడా తెలిసి ఉంటుందని.. ఇప్పుడు దిల్లీ టెస్టుకు ముందు డూప్లికేట్ జడేజా కోసం వారు వెతకరని భారత మాజీ ఆటగాడు కైఫ్ అన్నాడు.
Mohammad Kaif: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసింది. అనంతరం 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో విజయం భారత్ సొంతమైంది.
అశ్విన్ డూప్లికేట్ తో ప్రాక్టీస్
ఈ టెస్ట్ విజయంలో లో భారత్ స్పిన్ ద్వయం అశ్విన్- జడేజాలు కీలకపాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి వీరిద్దరూ 15 వికెట్లు పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడడానికి నిరాకరించింది. అలాగే స్పిన్ ను సమర్దంగా ఎదుర్కొనేందుకు నెట్స్ లో తీవ్రంగా శ్రమించింది. అంతేకాకుండా అశ్విన్ ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా సన్నద్ధమైంది. అచ్చం అశ్విన్ లాంటి బౌలింగ్ యాక్షన్ కలిగిన దేశవాళీ బౌలర్ మహేశ్ పిథియాతో బౌలింగ్ వేయించుకుని ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. అయితే ఎంత ప్రాక్టీస్ చేసినా.. ఎంతగా సన్నద్ధమైనా అసలు మ్యాచ్ కు వచ్చేసరికి ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. స్పిన్ ను ఆడలేక చేతులెత్తేశారు. దీనిపై భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఆస్ట్రేలియా జట్టుకు చురకలు అంటించాడు.
'ఆస్ట్రేలియాకు ఇప్పుడు డూప్లికేట్ అశ్విన్ కు, నిజమైన అశ్విన్ కు తేడా తెలిసిందని అనుకుంటున్నాను. యువ ఫస్ట్ క్లాస్ బౌలర్ ను ఎదుర్కోవడం ద్వారా ఆల్ టైమ్ గ్రేట్ లో ఒకరిని ఎదుర్కోవడానికి మీరు సిద్దం కాలేరు. ఇప్పుడు ఢిల్లీలో జరగబోయే రెండో టెస్టుకు వారు జడేజా డూప్లికేట్ కోసం వెతకరని ఆశిస్తున్నాను.' అంటూ కైఫ్ ఆసీస్ పై సెటైర్లు వేశాడు.
Australia now know the difference between facing duplicate Ashwin and real Ashwin. You can't prepare to face one of all-time great by facing a young first-class player. Hope they not searching for a Jadeja duplicate in Delhi.
— Mohammad Kaif (@MohammadKaif) February 12, 2023
న్యూడిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
ఏ కెప్టెన్ అయినా కావాలని కోరుకునే ఆటగాడు జడేజా
జడేజా ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. 'జడేజా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. బంతితో, బ్యాట్ తో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అతను ప్రస్తుతం నెంబర్ వన్ ఆల్ రౌండర్. అతడిలాంటి ఆల్ రౌండర్ ను ప్రపంచ క్రికెట్ చూడలేదు. అతడు ప్రతి విభాగంపై ఆధిపత్యం చెలాయిస్తాడు. నిరంతరం ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి సృష్టిస్తాడు. ఏ కెప్టెన్ అయినా జడేజా లాంటి ఆటగాడు తన తుది జట్టులో ఉండాలని కోరుకుంటాడు.' అని డానిష్ కనేరియా అన్నాడు.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Never easy to return to top level cricket after an injury. Not if you are Sir jadeja. He is deadly! <a href="https://twitter.com/hashtag/INDvsAUS?src=hash&ref_src=twsrc%5Etfw" rel='nofollow'>#INDvsAUS</a></p>— Mohammad Kaif (@MohammadKaif) <a href="https://twitter.com/MohammadKaif/status/1623604206262444032?ref_src=twsrc%5Etfw" rel='nofollow'>February 9, 2023</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>