Hyderabad Ranji Trophy: హైదరాబాద్ జైత్రయాత్ర, వరుసగా నాలుగో విజయం
Hyderabad Cricket Team: హైదరాబాద్ జట్టు... తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 187 పరుగుల తేడాతో గెలుపొందింది.
![Hyderabad Ranji Trophy: హైదరాబాద్ జైత్రయాత్ర, వరుసగా నాలుగో విజయం Hyderabad winning continues in prestigious national tournament Ranji Trophy Hyderabad Ranji Trophy: హైదరాబాద్ జైత్రయాత్ర, వరుసగా నాలుగో విజయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/bbda845386958f49840bcaa549131c3c1706417695282234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
National Tournament Ranji Trophy: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్లేట్ గ్రూప్‌లో ఇప్పటికే వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన హైద్రాబాద్ జట్టు... తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 187 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించిన హైద్రాబాద్.. నాలుగో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ విజయం సాధించి సత్తా చాటింది. ప్లేట్ గ్రూప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసుకున్న హైదరాబాద్.. తాజాగా ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ బాదడంతో అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 187 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ రెండు రోజుల్లోనే ఫలితం రావడం కొసమెరుపు. ఓవర్‌నైట్ స్కోరు 529/1తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్.. 615/4 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ 256 పరుగులకు ఆలౌటైంది. దివ్యాన్ష్ (91) టాప్ స్కోరర్ కాగా.. తనయ్, సాయిరామ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తాజా సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ బోనస్ పాయింట్ విజయాలు సాధించింది.
ఊచకోత అంటే ఇదేనేమో...
దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్(Team Hyderabad) జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్ జట్టు.. నాలుగో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది. అరుణాచల్ ప్రదేశ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. కేవలం 147 బంతుల్లో త్రి శతకం సాధించి దేశవాళీ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. 147 బంతుల్లోనే 300 పరుగులు సాధించిన తన్మయ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్ 191 బంతుల్లో 300 పరుగులు చేయగా... ఈ రికార్డును తన్మయ్ బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫర్డ్ 234 బంతుల్లో... వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 244 బంతుల్లో.. శ్రీలంకకు చెందిన కుశాల్ పెరిరా 244 బంతుల్లో త్రిశతకాలు సాధించారు. వీరందినీ అధిగమించిన తన్మయ్ కేవలం 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 పరుగులు చేసిన తన్మయ్ నాటౌట్‌గా ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు.
రవిశాస్త్రి రికార్డు బద్దలు
తన్మయ్ భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగూనూ రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ కేవలం 119 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 39 ఏళ్ల క్రితం దేశవాళీ క్రికెట్‌లో రవిశాస్త్రి 123 బంతుల్లో డబల్ సెంచరీ చేయగా.. ఈ రికార్డును తన్మయ్ బద్దలు కొట్టాడు. తన్మయ్ కేవలం 119 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (14) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా తన్మయ్ (21) బద్దలు కొట్టాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)