By: ABP Desam | Updated at : 07 Jun 2023 10:04 PM (IST)
డబ్ల్యూటీసీ విజేతలకు అందజేయబోయే గద ( Image Source : Thomas Lyte Twitter )
Making Of WTC Mace: క్రికెట్ అభిమానులను టెస్ట్ సమరంలో ముంచెత్తడానికి భారత్ - ఆస్ట్రేలియాలు ఓవల్ వేదికగా హోరాహోరి తలపడుతున్నాయి. ఫైనల్ లో నెగ్గిన వారికి భారీ నగదు బహుమతితో పాటు ఐసీసీ ప్రత్యేకంగా ‘గద’ను కూడా అందజేస్తుంది. అసలు ఏంటీ గద కథ..? ఐసీసీ ఏ మేజర్ టోర్నీలో అయినా అందజేసే ట్రోఫీకి దీనికి తేడా ఏంటి..? ఈ గదను ఎవరు తయారుచేస్తారు..? మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది..? వంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
ఆలోచన పుట్టిందక్కడ..
ప్రస్తుతం అందజేస్తున్న గదకు గత చరిత్ర ఘనంగానే ఉంది. 2000 సంవత్సరం నుంచే ఐసీసీ దీనిని అందజేస్తున్నది. ట్రావెర్ బ్రౌన్ అనే ప్రఖ్యాత డిజైనర్ దీనిని రూపొందించాడు. ఈ గదను తయారుచేయడానికి ఆయనను స్ఫూర్తినిచ్చిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఒక క్రికెట్ మ్యాచ్ చూశాకే ఆయనకు ఈ ఆలోచన పుట్టిందట.. ఇదే విషయమై ఆయన స్పందిస్తూ.. ‘నేను ఓసారి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ను చూశాను. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సభ్యులు స్టంప్ తీసుకుని సంబురాలు చేసుకున్నారు. ఆ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది. దాని స్ఫూర్తిగానే గద తయారీ ఆలోచన పుట్టింది’ అన్నాడు.
క్రికెట్‌లో ప్రధానమైన బంతిని కేంద్ర బిందువుగా చేసుకుని దీనిని రూపొందించారు. బంతికి స్టంప్ ఆకారంలో ఉండే హ్యాండిల్‌ను అమర్చారు. స్టంప్ కింది భాగంలో ఉన్నట్టుగానే గద హ్యాండిల్‌కు కూడా కింద ఆకృతి మొన ఆకారంలో ఉంటుంది. పైన భాగంలో బంతి పైన భూగోళం మ్యాప్‌ను అమర్చారు. ఇది టెస్టు క్రికెట్ ప్రపంచ స్థాయిని తెలియజేస్తుంది. హ్యాండిల్ చుట్టూ ఉండే రిబ్బన్ ను విజయానికి చిహ్నాంగా సూచిస్తారు.
Designed by Thomas Lyte’s world-class trophy designer Trevor Brown, and handcrafted by our team of master silversmiths in our London workshops, the @ICC World Test Championship Mace will be lifted in a final for the first time this weekend. #Cricket #WTCFinal @BCCI @BLACKCAPS pic.twitter.com/DWvXJNgh4e
— Thomas Lyte (@ThomasLyte) June 19, 2021
డిజైన్..
గదలోని ప్రధానభాగాలైన బంతి ఆకారంలో ఉండే రూపంతో పాటు పొడవాటి స్టంప్ రూపంలో ఉండే హ్యాండిల్‌ను వెండితో తయారుచేస్తారు. బంతి ఆకారంలో ఉండేదానిపై ప్రపంచదేశాల (గ్లోబ్ మ్యాప్) గుర్తులకు మాత్రం బంగారపు పూత పూస్తారు. ఇక హ్యాండిల్ కింది భాగంలో ఉండే మొనను హార్డ్ వుడ్‌తో తయారుచేస్తారు. బంతి ఆకారంలో మధ్యలో కొన్ని బాక్సులను ఏర్పాటు చేసి అందులో క్రికెట్ ఆడే దేశాల చిహ్నాలను అమరుస్తారు. వీటికి కూడా బంగారు పూత పూస్తారు.
ట్రోఫీకి దీనికి తేడాలేంటి..?
మామూలుగా అయితే ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ ట్రోపీలు పట్టుకోవడానికి వీలుగా రెండు హ్యాండిల్స్ ఉంటాయి. అంతేగాక ఆ హ్యాండిల్స్ కు కింద బాగంలో సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ గద అలా కాదు. బంతి ఆకారంలో చుట్టూ ఉండే పంజరం మాదిరిగా ఉండి దానికి వరల్డ్ మ్యాప్ అంటించబడి ఉంటుంది. ఇది తయారుచేయడం అత్యంత క్లిష్టమైన విషయం అని చెబుతున్నాడు ఈ గద తయారీలో పాలు పంచుకున్న లీ బుల్.
దీనిని ఏ మిల్లులోనూ, ఫ్యాక్టరీలోనూ ప్రత్యేక మిషన్స్ పెట్టి తయారుచేయరు. పాలిషింగ్ చేసేందుకు చిన్న చిన్న మిషన్స్ తప్ప మెయిన్ వర్క్ అంతా చేతులమీదుగానే చేస్తారని లీ బుల్ చెప్పాడు. బంతి ఆకారంలో ఉన్న గ్లోబుపై ఉండే చిన్న రాడ్స్‌ను వంచడానికి, వాటిపై గ్లోబ్ మ్యాప్ ను అతికించేందుకు వీలుగా వాటిని 700 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలలో వేడి చేస్తారు.
Meet the team who designed and handcrafted the Mace… The @ICC visited the Thomas Lyte silver workshops in London to film the making of the 2021 ICC Test Championship Mace.#WTC21 #WTCFinal #testcricket #IndiaVsNewZealand@BCCI | @BLACKCAPS https://t.co/ex1tTPs31t
— Thomas Lyte (@ThomasLyte) June 20, 2021
ప్రధాన టోర్నీలకు ట్రోఫీలు వీళ్లవే..
థామస్ లైట్ ఇంగ్లాండ్‌లోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గోల్డ్, సిల్వర్ ఆకృతులను తయారుచేసే సంస్థ. ఫుట్‌బాల్ లో నిర్వహించే ఫిఫా, ఎఫ్ఎ కప్, ఛాలెంజర్స్ కప్, టెన్నిస్ టోర్నీలతో పాటు ఐసీసీ నిర్వహించే టోర్నీలకు థామస్ లైట్ ట్రోఫీలను రూపొందిస్తుంది. ఐసీసీ, ఇతర క్రీడా సంస్థలు అందించే అవార్డులను రూపొందించేది కూడా ఈ సంస్థే కావడం విశేషం.
ICC ODI Cricket World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ వేడుకలు రద్దు!
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
R Sai Kishore: జాతీయ గీతం రాగానే అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి! శెభాష్ సాయికిశోర్
ICC World Cup 2023: వరల్డ్ కప్‌లో టీమిండియా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? టాప్ ప్లేయర్ ఎవరు?
Shubman Gill: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు కీలకం శుభ్‌మన్ గిల్‌నే - గణాంకాలు ఏం చెబుతున్నాయి?
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
/body>