By: ABP Desam | Updated at : 29 Aug 2022 10:20 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
గంభీర, అఫ్రిదిల వాగ్వాదం (ఫైల్ ఫొటో) (Image Credits: BCCI)
ప్రస్తుత తరం క్రికెటర్లు దేశాలకు సంబంధించిన విద్వేషాలతో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవాలను చూపించుకుంటూ ఉంటారు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజంలు మైదానంలో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ మాజీ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మాత్రం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చాడు. భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్‌కు చెందిన సమా టీవీలో అఫ్రిది మాట్లాడుతూ ‘నాకు మిగతా భారత క్రికెటర్లతో ఎటువంటి వివాదాలు లేవు. కానీ నాకు గౌతం గంభీర్‌తో కొన్ని సార్లు సోషల్ మీడియాలో వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. గౌతం ఎలాంటి వాడంటే నేనే కాదు భారత జట్టులో కూడా తనను ఎవరూ ఇష్టపడరు.’ అన్నాడు.
హర్భజన్ ఎందుకు వచ్చాడు?
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దీనిపై స్పందించిన తీరు ఇప్పుడు వివాదాస్పదం అయింది. అఫ్రిది ఈ కామెంట్ చేసిన సమయంలో ఒక న్యూస్ చానెల్లో హర్భజన్ సింగ్ ఉన్నాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో హర్భజన్ సింగ్ నవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గంభీర్‌కు హర్భజన్ సింగ్ మద్దతు ఇవ్వాల్సిందంటూ అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా గౌతం గంభీర్, షాహిద్ అఫ్రిదిలకు ఎప్పుడూ పడేది కాదు. వీరిద్దరూ మైదానంలో ఎప్పుడు ఎదురు పడినా వాతావరణం వేడెక్కేది. 2007లో కాన్పూర్ వన్డేలో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు.
ఇక ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎంతో థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 31వ తేదీన హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడే అవకాశం ఉంది.
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా... చివర్లో రవీంద్ర జడేజా (35: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 నాటౌట్: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) మ్యాచ్‌ను గెలిపించారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు, హార్దిక్ పాండ్యా మూడు, అర్ష్‌దీప్ సింగ్ రెండు, అవేష్ ఖాన్ ఒక వికెట్ సాధించారు.
This is wrong statement by Afridi 😡@GautamGambhir always will be hero whole india .....Afridi says India team hi pasand nhi karti what nonsense🤬 don't speak anything about gauti sir🌍
— AJ (@biharshain) August 28, 2022
We loved ❤️ Gautam gambhir pic.twitter.com/iugWFXPZ91
Afridi saying such things is understandable but sad to see @vikrantgupta73 sir and Harbhajan Singh @harbhajan_singh sir laughing instead of countering
— BEYOND THE NEWS (@beyondthenew) August 28, 2022
How can @harbhajan_singh laugh on it .Man you have played so much with that guy atleast you should not have laughed on it.#INDvPAK #disappointing https://t.co/LUQa3eg7IO
— Aman Kumar Singh (@rajputaman22) August 28, 2022
South Africa Squad vs India: భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన, బవూమాకు బిగ్ షాక్
IND v AUS: టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..
Virat Kohli: కింగ్ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట
Sports Award selection committee: క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
/body>