అన్వేషించండి

Head Controversial Celebrations; హెడ్.. ఇంగీతం ఉండక్కర్లేదా? భారతీయులను అవమానించావ్, ఐసీసీ కఠినంగా శిక్షించాలి: సిద్ధూ

మ్యాచ్ లో ఆటగాళ్లు వికెట్లు తీసినప్పడు వివిధ రకాల సంబరాలను చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ సంబరాలు అభిమానులను అలరిస్తుండగా, మరికొన్నిసార్లు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. 

Aus Vs Ind Test News: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత్ 184 పరుగులతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీందో ఐదు టెస్టుల సిరీస్ లో 1-2తో వెనుకంజలో నిలిచింది. పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ని కోల్పోయే దుస్థితిలో నిలిచింది. ఇందుకు ముఖ్య కారణంగా సీనియర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మను చెప్పుకోవచ్చు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ నిర్లక్ష్య పూరిత బ్యాటింగ్ ను కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అప్పటివరకు సజావుగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ పంత్ వికెట్ ఒక్కసారిగా పడిపోయాక, సైకిల్ స్టాండును తలపించింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు వెనుదిరిగారు. ఇక పంత్ వికెట్ తీసిన ఆనందంలో ఆసీస్ ఆల్ రౌండర్ ట్రావిస్ హెడ్ విచిత్రమైన సంబరాలను చేశాడు. దీనిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ కమ్ పొలిటీషియన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఫైరయ్యాడు

ఇంగీతం ఉండక్కర్లేదా..?
పంత్ ఔటయ్యాక హెడ్ విచిత్రమైన సంకేతాన్ని చూపాడు. తన ఎడమచేతిని గుండ్రగా చుట్టి, అందులో కుడి చేతి చూపుడు వేలును తిప్పుతున్నట్లు అసహ్యకరంగా సంకేతాన్ని ఇచ్చాడు. దీన్ని చూసిన చాలామంది క్రికెట్ ప్రేమికులు ఆక్వర్డ్ గా ఫీలయ్యారు. అయితే ఈ సంబరాలను తాజాగా సిద్దూ ఖండించాడు. జెంటిల్మన్ గేమ్ గా పేరున్న క్రికెట్ కు మచ్చ తెచ్చేందుకు హెడ్ ఇలాంటి వికృతాలకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. అతని చేష్టలతో 1.5 బిలియన్ల భారతీయులను అవమానించాడని ధ్వజమెత్తాడు. అతనిపై వెంటనే చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఎవరూ ఇలా మతిలేకుండా ప్రవర్తించుకుండా కఠినంగా వ్యవహరించాలని ఐసీసీని కోరాడు. టీవీల్లో మ్యాచ్ లను పిల్లలు, మహిళలు, ఇంకా చాలామంది వివిధ ఏజ్ గ్రూపుల్లోని వాళ్లు చూస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని చురకలు అంటించాడు. 

వెనకేసుకొచ్చిన కమిన్స్
ఇక హెడ్ చేసిన పనిని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెనకేసుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హెడ్ సంబరాలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. వేడేక్కిన తన చూపుడు వేలును, ఐస్ బకెట్లో పెట్టిన రీతిలో సంకేతాన్ని చూపాడని పేర్కొన్నాడు. ఇది సాధరణమేనని, అదోక జోక్ అని సమర్థించాడు. ఏదేమైనా మెల్ బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరే అవకాశాలకు భారత్ క్లిష్టం చేసుకుంది.

ఫైనల్ రేసులో ఉండాలంటే సిడ్నీలో జరిగే ఐదో టెస్టును తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. అలాగే శ్రీలంక-ఆసీస్ టెస్టు సిరీస్ ఫలితం తనకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ఇక, ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు సౌతాఫ్రికా చేరుకోగా, రెండోస్థానం కోసం భారత్, ఆసీస్, లంకల మధ్య పోటీ నెలకొంది. 

Also Read: Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Mahakumbh 2025 : మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?
మహా కుంభమేళా మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది.. దాని చరిత్ర ఏంటో తెలుసా ?
Naga Sadhu in Mahakumbh : నాగ సాధువులకు చలి పెట్టదా? - ఎప్పుడూ అలా నగ్నంగా ఎలా ఉంటారు?, దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!
నాగ సాధువులకు చలి పెట్టదా? - ఎప్పుడూ అలా నగ్నంగా ఎలా ఉంటారు?, దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Embed widget