నా సపోర్ట్ పాకిస్తాన్‌కే - ఎందుకో చెప్పిన భారత మాజీ ఓపెనర్!
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌కు భారత మాజీ బ్యాటర్ సంజయ్ బంగర్ మద్దతు ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించేందుకు భారత మాజీ బ్యాటర్ సంజయ్ బంగర్ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచాడు. పాకిస్తాన్ తమ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత వారు ఇంటిబాట పట్టినట్లే అనిపించింది. కానీ పాకిస్థాన్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకోగలిగింది. అక్కడ వారు తమ రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. మెల్‌బోర్న్‌లో జరిగే శిఖరాగ్ర పోరులో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ బౌలింగ్ వారికి పైచేయిని ఇస్తుందని బంగర్ భావిస్తున్నాడు.
"నేను పాకిస్తాన్‌కు మద్దతు. పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ కారణంగా వారికి మ్యాచ్‌ను గెలిచే అర్హత వచ్చింది." అని సంజయ్ బంగర్ అన్నారు. ఫైనల్‌కు ముందు షహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్‌ల పేస్ క్వార్టెట్ తన జట్టుకు బలం అని అంగీకరించడానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ కూడా వెనుకాడలేదు.
మరోవైపు ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నందున రిజర్వ్ డే నిబంధనలను కూడా ఐసీసీ మార్చింది. "ఈవెంట్ టెక్నికల్ కమిటీ (ETC) రిజర్వ్ రోజున అదనపు ఆట సమయాన్ని రెండు గంటల (ప్లేయింగ్ షరతులలోని నిబంధన 13.7.3) నుంచి నాలుగు గంటలకు పెంచింది." అని తన అధికారిక ప్రకటన పేర్కొంది. ఫైనల్ కోసం నాకౌట్ దశలో ఒక మ్యాచ్ జరగాలంటే ప్రతి జట్టుకు 10 ఓవర్లు అవసరం.
"నాకౌట్ దశలో ఒక మ్యాచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతి జట్టుకు 10 ఓవర్లు అవసరమని గమనించవచ్చు. అవసరమైతే ఓవర్లు తగ్గించి షెడ్యూల్ చేసిన రోజున మ్యాచ్ రోజున మ్యాచ్‌ను పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి." అని ప్రకటనలో పేర్కొన్నారు.
"ఆదివారం మ్యాచ్‌ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస ఓవర్ల సంఖ్యను వేయలేకపోతే మాత్రమే మ్యాచ్ రిజర్వ్ డేకి వెళుతుంది. రిజర్వ్ డే రోజున ఆట భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది షెడ్యూల్ చేయబడిన మ్యాచ్ రోజు నుంచి ఆట కొనసాగింపుగా ఉంటుంది." అన్నారు.
ఆదివారం నాటి మ్యాచ్‌కు 30 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉండగా, మ్యాచ్ పూర్తి కావడానికి సోమవారం అదనంగా నాలుగు గంటల అదనపు సమయం ఉంది. మ్యాచ్ ముగిసే సమయానికి స్కోర్లు టై అయితే సూపర్ ఓవర్ ఆడతారు. వాతావరణం కారణంగా సూపర్ ఓవర్ పూర్తి కాకపోతే, అప్పుడు పాకిస్తాన్, ఇంగ్లండ్‌లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.
View this post on Instagram