Uppal Test Match Updates: హైదరాబాద్ టెస్టులో 246 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ముగించిన ఇంగ్లండ్
Hyderabad Test Match: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో......... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో......... 246 పరుగులకు ఆలౌట్ అయింది.
India vs England 1st Test At Rajiv Gandhi International Stadium: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో......... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో......... 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు చెలరేగడంతో బ్రిటీష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీయగా.... అక్షర్ పటేల్ రెండు, బుమ్రా రెండు వికెట్లతో రాణించారు. పది వికెట్లలో ఎనిమిది వికెట్లను స్పిన్నర్లే తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లను టీమిండియా స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్లు దూకుడుగా ఆడడంతో స్టోక్స్ సేన.......11 ఓవర్లకు 53 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కానీ స్పిన్నర్ల రంగ ప్రవేశంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అశ్విన్, జడేజా, అక్షర్ బౌలింగ్‌కుతోడు......... ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లు అందుకోవడంతో 155 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి.... బ్రిటీష్ జట్టు కష్టాల్లో పడింది.
కానీ సారధి బెన్ స్టోక్స్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 88 బంతుల్లో 70 పరుగులు చేసిన స్టోక్స్‌ను బుమ్రా వెనక్కి పంపడంతో... 246 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
స్పిన్నర్ల వేట..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు ముప్పు తిప్పలు పెట్టారు. ఓపెనర్లు దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్ ఆరంభంలో పటిష్టంగానే కనిపించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఖాతాలోనే తొలి వికెట్ చేరింది. అశ్విన్ బౌలింగ్‌లో 35 పరుగులు చేసిన డకెట్ అవుటయ్యాడు. డకెట్ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం ఇంగ్లాండ్‌కు అనుకూలంగా రాలేదు. సమీక్షలో ‘అంపైర్స్ కాల్’ రావడంతో డకెట్ పెవిలియన్ బాట పట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సారధి రోహిత్ సూపర్ క్యాచ్‌తో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఓలీపోప్ స్లిప్‌లో రోహిత్‌కు దొరికాడు. దీంతో 58 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ నష్టపోయింది. అనంతరం సిరాజ్ సూపర్బ్ క్యాచ్‌కు మూడో వికెట్ పడింది. అశ్విన్ వేసిన 16వ ఓవర్ తొలి బంతికే మిడాఫ్‌లో సిరాజ్ మియా అద్భుతమైన క్యాచ్‌కు ఓపెనర్ క్రాలే అవుటయ్యాడు. దీంతో 60 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ నష్టపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 108/3 పరుగులతో నిలిచింది. అనంతరం అక్షర్ పటేల్ సూపర్ డెలివరీకి బెయిర్ స్టో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
బెయిర్ స్టో (37) పరుగులకు వెనుదిరిగాడు. దీంతో 33 ఓవర్లకు 121 పరుగుల వద్ద బ్రిటీష్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. జో రూట్ (29)ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. జడ్డూ వేసిన బంతినిరూట్ స్వీప్ షాట్ ఆడబోయి షార్ట్ ఫైన్ లెగ్‌లో బుమ్రా చేతికి చిక్కాడు.125 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్‌ను నష్టపోయింది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు మరో వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఫోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను భారత వికెట్ కీపర్ పట్టాడు.దీంతో 137 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఆరో వికెట్‌ను నష్టపోయింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఆ తర్వాత స్టోక్స్ పోరాడాడు. టెయిలెండర్ల సాయంతో స్టోక్స్ ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది.