అన్వేషించండి

ENG vs AUS: ఇంగ్లండ్‌ ముందు 287 పరుగుల లక్ష్యం, ఛేదిస్తుందా! చతికిలపడుతుందా?

ODI World Cup 2023: ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు మరింత చేరువవుదామనుకున్నా కంగారులను బ్రిటీష్‌ జట్టు  బౌలర్లు కంగారు పెట్టారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసిస్‌ బ్యాటర్లను కట్టడి చేశారు.

ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం అనుకున్నట్లే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌... ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు మరింత చేరువవుదామనుకున్నా కంగారులను బ్రిటీష్‌ జట్టు  బౌలర్లు కంగారు పెట్టారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసిస్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్‌ త్వరగానే అవుట్‌ కావడంతో ఆస్ట్రేలియా జట్టు కష్టాలు ప్రారంభమయ్యాయి. 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే ఇంగ్లండ్‌ బౌలర్లు కంగారులకు షాక్‌ ఇచ్చారు. రెండో ఓవర్‌లోనే వోక్స్‌ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ట్రావిస్‌ హెడ్‌ను వోక్స్‌ వెనక్కి పంపాడు. 10 బంతుల్లో 11 పరుగులు చేసి వోక్స్‌ పెవిలియన్‌ చేరాడు. కాసేపు ఆసిస్‌ వికెట్ల పతనం ఆగినా మరోసారి వోక్స్‌ కంగారులను దెబ్బ కొట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్‌ను వోక్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. 16 బంతుల్లో ఒక సిక్సు, ఒక ఫోరుతో 15 పరుగులు చేసిన వార్నర్‌ 38 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ ఆసిస్‌ను ఆదుకున్నారు. సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన ఈ జోడీ గతి తప్పిన బంతులను శిక్షిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. ఆసిస్‌ భారీ స్కోరు చేయడం ఖాయమనుకుంటున్న సమయంలో ఆదిల్‌ రషీద్‌ ఇంగ్లండ్‌కు ఉపశమనం అందించాడు. 52 బంతుల్లో 3 ఫోర్లో 44 పరుగులు చేసిన స్టీవ్‌ స్మిత్‌ను అదిల్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత నాలుగు పరుగులకే మరో వికెట్‌ పడింది. 6 బంతుల్లో మూడు పరుగులు చేసిన జోస్‌ ఇంగ్లిస్‌ను అవుట్‌ చేసి రషీద్‌ మళ్లీ దెబ్బకొట్టాడు. 117 పరుగుల వద్ద కంగారులు నాలుగో వికెట్‌ కోల్పోయారు. అనంతరం లబుషేన్‌తో జత కలిసిన కామెరూన్ గ్రీన్‌ ఆచితూచి ఆడాడు. వీళ్లిద్దరూ జట్టు స్కోరును మెల్లగా ముందుకు కదిలించారు. వీరిద్దరూ 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని వుడ్‌ విడగొట్టాడు.   
 
83 బంతుల్లో 7 ఫోర్లతో 71 పరుగులు చేసిన లబుషేన్‌ను వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 178 పరుగుల వద్ద కంగారులు అయిదో వికెట్‌ కోల్పోయారు. కానీ గ్రీన్‌ పోరాటం ఆపలేదు. జట్టు స్కోరును 200 పరుగుల మార్క్‌ దాటించాడు. కానీ అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న గ్రీన్‌ను విల్లీ బౌల్డ్‌ చేశాడు. 52 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసి గ్రీన్‌ అవుటయ్యాడు. అనంతరం స్టోయినీస్‌ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి స్టోయినీస్‌ అవుటయ్యాడు. మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో జట్టులోకి వచ్చిన గ్రీన్‌, స్టోయినీస్‌ పర్వాలేదనిపించారు. అనంతరం పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా కూడా రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అందరూ సమష్టిగా రాణించారు. క్రిస్‌ వోక్స్ 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. మార్క్‌ వుడ్‌ 2, అదిల్‌ రషీద్‌ 2 వికెట్లు తీశారు.
 
287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లండ్‌కు పెద్ద కష్టం కాకపోయినా ఇప్పుడున్నా పరిస్థితుల్లో ఆ జట్టు బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికే సెమీస్ ఆశలు కోల్పోయిన ఇంగ్లండ్‌ కంగారులపై గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతుడడం బ్రిటీష్‌ జట్టును కలవరపరుస్తోంది. చివరి మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌ 170 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌కు గెలుపు తప్పనిసరి. ప్రపంచ కప్‌లో మొదటి ఏడు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకూ ఇరు జట్లు 155 వన్డేల్లో తలపడగా 87 సార్లు ఇంగ్లండ్‌ ఓడిపోయింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget