అన్వేషించండి

Crime News: డ్రోన్ తో గాలించి గంజాయి పట్టుకున్న ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు

Asifabad Crime News | ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు డ్రోన్ తో గాలించి 51 గంజాయి మొక్కలు గుర్తించిన , గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.


కెరిమెరి: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండల పరిధిలో గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఆసిఫాబాద్ ఎఎస్పీ చిత్తరంజన్ డ్రోన్ సహాయంతో పంట భూములపై పర్యవేక్షణ నిర్వహించారు. డ్రోన్ సర్వే ద్వారా గంజాయి మొక్కలు సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, సంబంధిత మండల పోలీస్ అధికారులు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే నిర్మూలన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఈ క్రమంలో కెరిమెరి మండలంలోని నారాయణగూడా గ్రామం, అంతపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాథోడ్ బాలాజీ అనే వ్యక్తి  వ్యవసాయ పొలంలో పత్తి, కంది పంటల మధ్యలో అంతరపంటగా గంజాయి సాగు చేశాడు. గాలింపు చర్యల్లో భాగంగా మొత్తం 51 గంజాయి మొక్కలు గుర్తించారు. ఆ మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.


Crime News: డ్రోన్ తో గాలించి గంజాయి పట్టుకున్న ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు

యువత భవిష్యత్తును నాశనం నాశనం చేసే గంజాయి

ఈ సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగం చట్టపరంగా తీవ్ర నేరం అని, ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయనీ, గత జూన్ 2025 నుండి ఇప్పటికి  ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లో 51 కేసులు కాగా, 560 మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు స్వయంగా ఈ నేరాలకు దూరంగా ఉండి, గంజాయి సాగు జరుగుతున్న సమాచారాన్ని వెంటనే డయల్ 100 లేదా 8712670551 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మరియు తగిన పారితోషికం అందించబడుతుందని ఆసిఫాబాద్ ఏఎస్‌పీ చిత్తరంజన్ పేర్కొన్నారు. 

గంజాయి రవాణా, సరఫరా, అమ్మకం లేదా మొక్కల పెంపకం జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా పోలీసులు నిరంతర పర్యవేక్షణ చర్యలను కొనసాగిస్తున్నట్లు ఏఎస్‌పీ తెలిపారు. గ్రామాల పరిధిలో డ్రోన్ సర్వేలు, స్థానిక పోలీస్ బృందాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కెరమెరి ఎస్సై మధుకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.Crime News: డ్రోన్ తో గాలించి గంజాయి పట్టుకున్న ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు

అటూ మరోపక్క ఆసిఫాబాద్ జిల్లాలోనీ లింగాపూర్ మండలంలోను పోలీసులు పలు చోట్ల సోదాలు నిర్వహించి గంజాయి మొక్కలు పట్టుకున్నారు. లింగాపూర్ మండలంలోని ఘుమ్నూర్ (కే) గ్రామ పరిధిలో పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని లింగాపూర్ ఎస్సై గంగన్న అధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసు బృందం తనిఖీలు నిర్వహించగా.. అడా లక్ష్మణ్ (30) అనే వ్యక్తి తన పత్తి పొలంలో అక్రమంగా 35 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని, నిందితుడు అడా లక్ష్మణ్ పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

గంజాయి సాగు, రవాణా, అమ్మకం పూర్తిగా నేరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గంజాయి సాగు లేదా రవాణా జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే డయల్ 100 లేదా 8712670551 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మరియు తగిన పారితోషికం కూడా అందజేయబడుతుందని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget