Ind Vs Eng 4th Test Latest Updates: నాలుగో టెస్టుకు టీమిండియాలో ఆ మార్పు చేయండి.. అతడిని తప్పిస్తే మేలు.. మాజీ క్రికెటర్ వ్యాఖ్య
నెం.3 స్థానంలో మార్పు చేయాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వరుసగా విఫలం అవుతున్న కరుణ్ ను పక్కన పెట్టాలని కోరుకుంటున్నారు. మూడు టెస్టులాడిన అతను కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు.

Karun Nair Vs Sai Sudharsan: ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో టీమిండియా కచ్చితంగా ఒక్క మార్పు చేయాల్సిందేనని మాజీ వికెట్ కీపర్, కామేంటేటర్ దీప్ దాస్ గుప్తా వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో ఆ మార్పు చేయాలని సూచించాడు. ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క టెస్టు గెలిచిన భారత్.. నాలుగో టెస్టులో విజయం సాధించి, బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. దీంతో సిరీస్ సమం చేయాలని కూడా భావిస్తోంది. అయితే ఈమ్యాచ్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్ ని మరింత పటిష్టం చేసుకోవాలని దాస్ గుప్తా సూచించాడు. అందుకోసం టాపార్డర్లో ఆడుతున్న కరుణ్ నాయర్ బదులుగా మరో ప్లేయర్ ని ఆడించాలని సూచించాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినప్పటికీ, నాయర్ దాన్ని ఉపయోగించుకోలేక పోయాడని పేర్కొన్నాడు.
ఒకేఒక్క బ్యాటర్..
నిజానికి పేస్ కు, స్వింగ్ కు అనుకూలించే ఇంగ్లాండ్ లో ఈసారి బ్యాటింగ్ పిచ్ లను సిద్ధం చేశారు. బ్యాటర్లు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ పరుగుల వరద పారిస్తున్నాయి. ఇక రెండు జట్లలోని టాప్ -లో కనీసం అర్ద సెంచరీ చేయని ఏకైక ప్లేయర్ గా కరుణ్ నిలిచాడు. తను ఆడిన మూడు టెస్టులు కలిపి కేవలం 131 పరుగులను కేవలం, 22 సగటుతో మాత్రమే సాధించాడు. మంచి ఆరంభాలు లభిస్తున్నా, వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడని దాస్ గుప్తా విమర్శించాడు. తన టెక్నిక్ తో పాటు క్రీజులో కూడా అసౌకర్యంగా కదులుతున్నాడని విశ్లేషించాడు. దీన్ని బట్టి, చూస్తే కరుణ్ ప్లేస్ లో సుదర్శన్ ను ఆడించాలని సూచించాడు.
ఇన్వెస్ట్ చేయాలి..
ఇప్పటికే 34వపడిలోకి చేరుకున్న కరుణ్ మరికొంతకాలం మాత్రమే టెస్టులను ఆడగలడని దాస్ గుప్తా పేర్కొన్నాడు. ఇప్పటికి ఇచ్చిన మూడు అవకాశాలను వృథా చేసుకున్న నాయర్ ని పక్కన పెట్టి, సుదర్శ్ ను ఆడించాలని సూచించాడు. కేవలం 21 ఏళ్ల ప్రాయంలోని సుదర్శన్ కు ఎంతో భవిష్యత్తు ఉందని, ఇంగ్లాండ్ లో ఆడించడం ద్వారా అతడిని పదును పెట్టవచ్చని తెలిపాడు. దీంతో మిగతా రెండు టెస్టులకు సుదర్శన్ ను ఆడించాలని తెలిపాడు. ఇంగ్లాండ్ లో ఆడే అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుందని, ఇప్పుడే సుదర్శన్ ను ఆయా పరిస్థితులకు ఎక్స్ పోజ్ చేస్తే, ఫలితం ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు తొలిటెస్టు ఆడిన సుదర్శన్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్, రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్లో తను టాప్ స్కోరర్ గా నిలిచి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ ట్రాఫోర్డు స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయ పడటంతో అతని స్థానంలో వేరే ఆటగాడిని ఆడించే అవకాశం ఉంది.




















